Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో..భూస్వాములులే లేరు..

  • రెవెన్యూ బిల్లు వల్ల వారికి ఎలా లాభం 
  • అనుభవదారు కాలమ్‌ ఎత్తేసాం
  • మండలిలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌, ‌సుదీర్ఘ చర్చ
  • పేదలకు అండగా కొత్త రెవెన్యూ చట్టం
  • ప్రభుత్వం వద్ద పక్కాగా భూముల వివరాలు మండలిలో సిఎం కెసిఆర్‌

తెలంగాణ శాసనమండలి కొత్త రెవెన్యూ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు శాసనసభ ఇదివరకే ఆమోదం తెలుపగా, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈమేరకు కొత్త రెవెన్యూ బిల్లును శానసమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ భూమిని నమ్ముకుని బతుకుతున్న పేదలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చామని పునరుద్ఘాటించారు. కొంతమంది నాయకులు బయట అవాకులు చెవాకులు పేలుతున్నారనీ, దానిని
ప్రభుత్వం పట్టించుకోబోదని ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొత్త రెవెన్యూ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని అంటున్నారు. కానీ తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జందార్లు లేరని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణలో ఉన్నదంతా మూడెకరాల లోపు ఆసాములేననీ, వారికి అండగా• నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. అందరూ ఆందోళన చెందుతున్నట్లుగా రాష్ట్రంలోని రిజిస్టేష్రన్‌ ‌కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమే లేదనీ, గత ప్రభుత్వాలు వీఆర్వోలకు అనవసర అధికారాలు ఇవ్వడంతో అరాచకాలకు పాల్పడ్డారని సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో వీఆర్వోలను రద్దు చేసి కఠిన నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. ధరణి పోర్టల్‌ ‌ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదన్నారు. సబ్‌ ‌రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్టేష్రన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ ‌కాగానే సంబంధిత కాపీలు వస్తాయన్నారు. రిజిస్టేష్రన్‌, ‌మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ ‌కాపీలు వెంటనే వస్తాయన్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ‌ఫోటోతో రిజిస్టేష్రన్లు చేస్తామన్నారు. ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్‌ ‌తెరుచుకోదన్నారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామన్నారు. రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రెవెన్యూ కోర్టులు రద్దు చేశామని తెలిపారు. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు అని సూచించారు. కావాలని వివాదాలకు వెళ్లే వారి విషయంలో ప్రభుత్వం సమయం వృథా చేయదు అని సీఎం స్పష్టం చేశారు.రాష్ట్రంలో మొత్తం 60,95,134 మంది పట్టాదారులు ఉన్నారని చెప్పారు. 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.

భూమి ప్రధాన ఉత్పత్తి సాధనంగా మారగానే మనిషి జీవనశైలి దానిచుట్టే తిరిగిందని చెప్పారు. అసఫ్‌జాహీల పాలనా కాలంలో ముగ్గురు సాలార్‌జంగ్‌లు సంస్కరణలు చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పడిపోతుందని నాటి సమైక్య పాలకులు బాకాలు ఊదినవారు శాపాలు పెట్టారని విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరం భూమి కనీసం రూ.10 లక్షలకు తక్కువలేదని చెప్పారు. అలాగే ప్రధాన ప్రాంతాల్లో కోటి వరకు కూడా ఉందన్నారు. ఈ బిల్లు వల్ల రైతులకు, నిరుపేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక భూమి ధర పడిపోతుందని సమైక్యవాదులు ప్రచారం చేశారని, అయితే ప్రస్తుతం ఎకరం ధర పది లక్షలకు తక్కువగా పలకడం లేదని ఆయన పేర్కొన్నారు. భూమి ఉత్పత్తి సాధనంగా మారిన తర్వాత మానవ జీవన శైలి దాని చుట్టే తిరిగిందని ఆయన చెప్పారు. అసఫ్‌జాహీల పాలనా కాలంలో ముగ్గురు సాలార్‌జంగ్‌లు భూ సంస్కరణలు చేశారని కెసిఆర్‌ ‌తెలిపారు. మొదటి సాలార్‌జంగ్‌ ‌కాలంలో పలు రెవెన్యూ సంస్కరణలు జరిగాయని ఆయన వెల్లడించారు. 1985లో పటేల్‌, ‌పట్వారీ వ్యవస్థ రద్దు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే 2007లో విఆర్‌ఒ ‌వ్యవస్థ వచ్చిందని, విఆర్‌ఒ ‌వ్యవస్థ అరాచకంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో తాము ఆ వ్యవస్థను రద్దు చేశామని ఆయన చెప్పారు. కొత్త రెవెన్యూ బిల్లు వల్ల భూస్వాములకు మేలు జరుగు తుందని బయట కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పక్కా ప్రణాళికతో పేద రైతుల హక్కులు కాపాడుతామని స్పష్టం చేశౄరు. రెవెన్యూ కోర్టులు రద్దు చేశామని, భూ తగాదాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని ఆయన చెప్పారు. కొత్త రెవెన్యూ బిల్లు వల్ల అధికారులు లంచం డిమాండ్‌ ‌చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.

భూముల వివరాలను రెండు విభాగాలుగా చేస్తూ ధరణిలో అందుబాటులో ఉంచుతారు. అలాగే వ్యవసాయ,వ్యవసాయేతర భూముల వివరాలను పక్కాగా నిర్దేశించారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు పేదలకు సరళీకృతమైనటువంటి కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుందని అన్నారు. అయితే సమగ్రంగా తీసుకుని వస్తున్న ఈ చట్టంపై ప్రజల్లో ఆసక్తి నెలకొందని గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ధరణి పోర్టల్‌ ‌రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, ‌నాన్‌ అ‌గ్రికల్చర్‌ ‌వివరాలు ధరణిలో ఉంటాయి. ఈ పోర్టల్‌తో రైతులకు మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర భూభాగం 2.75కోట్ల ఎకరాలు. ధరణి పోర్టల్‌ ‌పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఏమూలనైనా ధరణిని ఓపెన్‌ ‌చేసి చూసుకోవచ్చు. ధరణి పోర్టలే అన్నింటికీ ఆయువు పట్టు. కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవు. నాన్‌ అ‌గ్రికల్చర్‌ ‌భూములను సబ్‌ ‌రిజిస్ట్రార్లు రిజిస్టేష్రన్‌ ‌చేస్తారని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇక నుంచి తహసీల్దార్లే జాయింట్‌ ‌రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తహసీల్దార్లకు వ్యవసాయ భూములే రిజిస్టేష్రన్‌ ‌చేసే అధికారం ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. విద్యావంతులైతే డాక్యుమెంట్లు వాళ్లే రాసుకోవచ్చు. కావాలంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్‌ ‌రైటర్‌ ‌సాయం తీసుకోవచ్చు. క్రయ విక్రయాల రిజిస్టేష్రన్‌ ‌చేసిన వెంటనే పోర్టల్‌లో అప్‌డేట్‌ అవుతాయి. రిజిస్టేష్రన్‌, ‌మ్యుటేషన్‌ ‌సహా అన్ని సేవలు ఏకకాలంలో పూర్తి అవుతాయని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు, పేదలకు సరళీకృతమైన కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply