Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌నిబంధనల్లో మార్పులు లేవు

  • అద్దె కోసం ఒత్తిడి చేయొద్దు
  • రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మహేశ్‌ ‌భగవత్‌

‌తొలి విడత లాక్‌డౌన్‌లో అమలు చేసిన నిబంధనలే రెండో విడతలో ఉంటాయని రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌మహేశ్‌ ‌భగవత్‌ ‌స్పష్టంచేశారు. ఈ నెల 20 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయని సీపీ తెలిపారు. అత్యవసర సేవల కోసం ఉచిత సర్వీసులను ప్రభుత్వమే నడుపుతోందన్నారు. సొంత వాహనానికి అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అద్దె•కు ఉంటున్న వారిని యజమానులు అద్దె• కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. ఎవరికైనా కొరోనా అనుమానిత లక్షణాలు ఉంటే 104కు ఫోన్‌ ‌చేసి చెప్పాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కొరోనా పాజిటివ్‌ ‌వస్తేనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారని సీపీ స్పష్టం చేశారు.

Leave a Reply