Take a fresh look at your lifestyle.

నడిగడ్డ వెనుకబాటుకు కారకులెవ్వరు..

‘‘‌నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’

నడిగడ్డ ఉమ్మడి పాల మూరు జిల్లాలోని రెండు జీవనదులు పారుతున్న ప్రాంతం.ఇది ప్రస్తతం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ ‌నియోజక వర్గంతో పాటు గద్వాల కూడా ఒకటి. రాయలసీమ,కర్ణాటకలు పక్కన ఉన్నందువలన ఈ ప్రాంతంమీద తెలంగాణ ప్రభావం కన్న ఎక్కువ రాయలసీమ వర్గా రాజకీయాల నేపథ్యం బాగ ఉంటుంది. ఈ గడ్డ చుట్టూ నీళ్ళు ప్రవహిస్తున్న అభివృద్ధికి వెనుకబాటుకు కూతవేటు దూరంలో ఉంటూ దశాబ్దాల పాటు బంగ్లాల కుటుంబ పాలనలో నలిగిపోతూ ఎస్‌.‌సి,ఎస్‌.‌టి,బి.సి. మైనారిటీ పేద వర్గాలకు ఆత్మగౌరవం లేకుండా అడుగడుగునా అవమానాలతో కాలం ఎల్లదీస్తూ సంక్షేమానికి,అభివృద్ధికి, ఉపాధికి దూరంగా నెట్టివేయబడ్డది.ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పగిస్తే అక్రమ సంపాదనతో ప్రజలను భయందోళనలకు గురిచేస్తూ అన్నదమ్ముల మధ్య కులాల నడుమ కోట్లాటలు పెడుతూ గెట్లకాడ పొలాల పంచాయితీలు సృష్ఠిస్తూ ఒకే కుటుంబం అధికారం కోసం విలువలను సిద్దాంతాలను మరిచిపోయి పార్టీలు మారుతూ ఒకే కుటుంబంలోని నాయకులు పార్టీలుగా విడిపోయి నడిగడ్డలో అధికారాన్ని తమ ఇంటి గేటు దాటకుండా గద్వాలను తమ గుప్పిట్లో బందీ చేసుకున్నారు.
గతంలో డి.కె.అరుణ మూడుసార్లు ఎం.ఎల్‌.ఏ ‌గా ఉండి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసినా వారి కుటుంబం నుండి భర్త భరతసింహారెడ్డి, బావ సమరసింహారెడ్డి,మామ సత్యారెడ్డి వరకు ఈ నియోజక వర్గాన్ని వరుసగా పాలించిన అక్రమ సంపాదనమీద పెట్టిన ధ్యాస ప్రజల సంక్షేమంమీద దృష్టి పెట్టలేదు.
నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.
ఇక్కడి ప్రజలు చదువుకొని జ్ఞానం సంపాదించి ఆర్థికంగా బాగుపడితే మా బంగ్లాల గడపల కాడ కూర్చునేవారెవరని ఒక కుట్రపూరితంగా ఈ ప్రాంతానికి మెరుగైన విద్యను అందించకుండా విద్యాలయాలను తీసుకరాకుండా కుట్ర చేశారు.వీరి డెబ్బై యేండ్ల పాలనలో అక్షరాస్యత పరంగా దక్షిణ ఆసియా ఖండంలోనే గట్టు మండలం అత్యంత వెనుకబాటుతనానికి గురైందన్నా,తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం చివరి స్థానంలో ఉందన్నా విద్యపై వీరికున్నా చిత్తశుద్ది ఎంటో తెలుస్తుంది.
నెట్టెంపాడు ప్రాజెక్టును మేమంటే మేము తీసుకొచ్చామని ప్రగల్భాలు పల్కుతున్నారు.రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికీ పూర్తి పనులు పూర్తిగాక సాగునీరు అందే ఆయకట్టు 50 వేల నుండి 60 వేల ఎకరాలలోపు మాత్రమే ఉంది.రైతుల నుండి ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమి మాత్రం ముప్పై వేల ఎకరాలు.చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ ‌కింద ఆయకట్టు లేదని ప్రజలు మా భూములు మాకు కావాలని సంవత్సరం నుండి ధర్నాలు చేస్తుంటే డి.కె.అరుణ వెళ్లి రైతుల ధర్నాకు మద్దతు తెలిసినప్పటికీ మీ హయంలోనే వచ్చిందన్న సంగతి మరిచారా?
ఈ ప్రాంతంలో అత్యధికంగా విత్తన పత్తిని సాగుచేస్తూ సీడ్‌ ‌హబ్‌ ‌గా పేరొందిన నడిగడ్డలో దలారులు (ఆర్గనైజర్‌) ‌రైతులను యథేచ్చగా దోపిడీ చేస్తున్నా ఏనాడు పాలకులు పట్టించుకోవడం లేదు.ఆయా కంపెనీలు నేరుగా ఫౌండేషన్‌ ‌సీడ్‌ ‌రైతులకు ఇవ్వకుండా  దలారులను నియమించుకొని వీరి ద్వారా విత్తన పత్తిని నలభై వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో  దలారులు కంపెనీ ఇచ్చే వాస్తవ ప్రయోజనాలను రైతులకు ఇవ్వకుండా దగా చేస్తున్నారు.రైతులకు పంట డబ్బులు డిసెంబరులో ఇవ్వాల్సినవి అధిక వడ్డీ లాభం కోసం జూలైలో ఇస్తున్నారు.పత్తి విత్తనాలు పాస్‌ ఐన కూడా ఫెయిల్‌ అనీ రైతులను నిండా ముంచి మోసం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి పాస్‌ ఐనా ఫెయిల్‌ ‌చేసినా విత్తన పత్తి రైతులకు అండగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ ‌గొంగళ్ల రంజిత్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో పోరాటం చేసి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు  ఇప్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో అధికార నాయకుల అండదండలతో బడుగుల నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా అణగద్రోక్కుతూ కల్తీ కల్లు దందాలు,కాంట్రాక్టుల కమీషన్ల కోసం బెదిరింపులు,మద్యం వ్యాపారాలు,కంకర మిషన్లతో మొదలు పెడితే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఇసుక మాఫియా,మట్టి మాఫియా,భూ కబ్జాలు చేస్తూ అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.

విద్వత్‌ ‌గద్వాలగా పేరుగడించిన ప్రాంతంలో న్యూడ్‌ ‌కాల్స్ ‌వ్యవహారంతో అనేక మంది మహిళల జీవితాలను చిదిమేసి రాష్ట్రవ్యాప్తంగా గద్వాల పేరును తలదించుకునేలా చేశారు ఈ పాలకులు. ప్రస్తుత అధికార పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా,తమ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిసిన గుంతల మయమైన రోడ్లు, అధ్వానమైన గ్రామాల అభివృద్ధి, చేనేత పార్క్ ‌హామీ,బస్టాండ్‌ ఆధునీకరణ,గుర్రంగడ్డ బ్రిడ్జి,300 పడకల ప్రభుత్వ దవాఖాన, కుల భవనాలు,జూరాల ప్రాజెక్టు దగ్గర పార్క్, ‌గట్టు ఎత్తిపోతల పథకం వంటి హామీలతోపాటు గద్వాలకు చెందిన అనేక ఆఫీసులు వనపర్తి జిల్లాకు తరలివెళ్లిపోతున్న కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఈ కుటుంబ పాలనలో ఈ ప్రాంత ప్రజలు నలిగిపోయినది చాలు.గతాన్ని, వర్తమానాన్ని మనం పోగొట్టుకున్నది చాలు.రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే అభివృద్ధి సంక్షేమం అన్ని వర్గాలకు అంది మన బహుజనులంత ఆత్మగౌరవంతో బతకాలంటే వీరి అహంకార పూరిత కుటుంబ పాలనను అణిచి వేయాలంటే వోటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాల్సిందే.

image.png
గొంగళ్ల రంజిత్‌ ‌కుమార్‌
‌నడిగడ్డ హక్కుల పోరాట సమితి
చైర్మన్‌, ‌జోగులాంబ గద్వాల జిల్లా.
9885954118.

Leave a Reply