ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటళ్లు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రోగులు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని, కానీ వారికి చికిత్స చేసే వారు కరువైనట్లు కోర్టు చెప్పింది. ఒకవేళ ఇదే రకమైన చికిత్స కొనసాగితే, హాస్పిటళ్లలో బెడ్స్ ఖాళీగా ఉండిపోతాయని కోర్టు పేర్కొన్నది. మృతదేహాల పట్ల ఎటువంటి మర్యాద ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది. ఢిల్లీలో ఎందుకు వైరస్ టెస్టింగ్‌ను తగ్గించారని కోర్టు ప్రశ్నించింది. ముంబైతో పాటు ఇతర నగరాల్లో టెస్టింగ్ పెరిగిందని, కానీ ఢిల్లీలో ఎందుకు టెస్టింగ్ తగ్గిందని కోర్టు నిలదీసింది. మృతదేహాల పట్ల ఢిల్లీ హాస్పిటళ్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మరణించిన వారి బంధువులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు కనీసం తమ బంధువుల చివరి చూపును కూడా నోచుకోవడం లేదంటూ కోర్టు పేర్కొన్నది. కేంద్ర •ంశాఖ ఇచ్చిన ఆదేశాలను హాస్పిటళ్లు బేఖాతరు చేస్తున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కోవిడ్ రోగులను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని కోర్టు పేర్కొన్నది.
ఢిల్లీలో లాక్డౌన్ పొడిగించేది లేదు
ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్
ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడిగించడం లేదంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్డౌన్ పొడిగించాలని కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో డియాతో మాట్లాడిన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అన్న ప్రశ్నకు ఆయన ఈ రకమైన సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 31 వరకు.. ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సోషల్ డియాలో ప్రచారం జరుగుతున్నది. రిలాక్ ఢిల్లీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది. ఢిల్లీలో ఇప్పటి వరకు 34 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1085 మంది మరణించారు. జూలై 31వ తేదీ వరకు ఢిల్లీలో సుమారు 5.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కానున్నట్లు సీఎం కేజీవ్రాల్ తెలిపారు.
మళ్లీ లాక్డౌన్ విధించబోం: సిఎం ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించబోమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శుక్రవారం ట్వీట్ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుతుండటంతో రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తారంటూ ఇటీవల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై స్పష్టత ఇచ్చారు. సడలించిన లాక్‌డౌన్‌ను తిరిగి పునరుద్ధరింబోమని చెప్పారు. అయితే ప్రజలంతా భౌతిక దూరంతోపాటు కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను పాటించాలన్నారు.