Take a fresh look at your lifestyle.

‌భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

వైధిక కమిటి, అధికారులతో అంతరంగికంగా నిర్వహణ

ప్రజాతంత్ర ప్రతినిధి, భద్రాచలం,జనవరి 12  : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా నిత్యకల్యాణం మండపం వద్ద వైధిక కమిటి మరియు కొద్దిమంది అధికారులతో అంతరంగికంగా నిర్వహించారు. 4 గంటల నుండి ప్రారంభం అయిన స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం వరకు నిర్వహించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులో స్వామివారిని ఉంచి ప్రదక్షణ గావించారు. ముందుగా జీవనది గోదావరి నీటిని తీసుకువచ్చి నిత్యకల్యాణ మండపం శుద్ది చేసి స్వామివారికి ఆ తరువాత స్వామివారిని నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. మేళాతాళాలు మధ్య అర్చకులు స్వామివారిని కొలనులో కుర్చుండబెటిట్ట ప్రదక్షణ నిర్వహించారు.

కోవిడ్‌ ‌పెరుగుతున్న నేపద్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఉన్నందున కొరోనా  కట్టడి చేసేందుకు భక్తులను అనుమతించలేదు. నిత్యకల్యాణ మండపం వద్దే తెప్పోత్సవ కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ ఆకాంఁ్‌ ‌యాదవ్‌, ‌దేవస్థానం ఇఓ శివాజీ మరియు రెవెన్యూ అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.తెల్లవారుజామున ఉత్తర వైకుంఠ ద్వాదర్శనం
గురువారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర వైకుంఠ ద్వారదర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. కొరోనా  తీవ్రతను బట్టి ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఉత్తర వైకుంఠ ద్వాదర్శనం నిర్వహిస్తారు. కేవలం అర్చకులు కొద్ది మంది ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో ఉత్తర ద్వార తలుపులు  తెరుచుకుంటాయి.

స్వామివారి కొంతమంది భక్తులకు మాత్రమే దర్శనమివ్వనున్నారు. బయట నుండి వచ్చే భక్తులకు ఏమాత్రం అనుమతి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే దేవస్థానం అధికారులు భక్తులకు తెఎలియచేసారు. వైకుంఠ ద్వారద్శనానికి ఎవరు రావద్దని అనుమతి  లేదని ముందుగానే సమాచారం అందచేసారు.  ద్వారదర్శనం ప్రాంతానికి ఎవరు రాకుండా పోలీస్‌ ‌బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెల్లవారుజామున వైభవోపేతంగా ఉత్తర వైకుంఠ ద్వారదర్శనం నిర్వహించారు.

Leave a Reply