టీఆర్ఎస్కు షాక్ ఇవ్వనున్న మాజీ మేయర్
కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో మంతనాలు
గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇవ్వనున్నారా ? గులాబీ గూటి నుంచి కమలం పంచన చేరడానికి ఆయన పావులు కదుపుతున్నారా ? గత కొద్ది రోజులుగా రెండు పార్టీలలోనూ ఇదే చర్చ జోరుగా జరుగుతోంది. ఈమేరకు కారు దిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆయన గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తీగల గత కొంత కాలంగా టీఆర్ఎస్కు
దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు, గ్రేటర్ ఎన్నికలలో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నగరంలో పట్టున్న టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నది. ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాద్‌కు మేయర్‌గా పనిచేసిన తీగలకు నగరంపై మంచి పట్టు ఉంది. టీఆర్ఎస్ తరఫున ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల నేతలతో ఆయనకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తీగల కొద్ది రోజులకే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ కండువ కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి తీగలపై విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. దీంతో తీగలకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. స

టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆమెకు సీఎం కేసీఆర్ క్యాబినెట్లో విద్యా శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చి ఉన్నత స్థానం కల్పించారు. ఎలాగూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వచ్చే ఎన్నికలలో టికెట్ కూడా సబితకే •• వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరిక అనంతరం తీగల పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయనను బుజ్జగించి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అగ్రనేతలు హామీ ఇవ్వడంతో ఆయన అప్పట్లో కాస్త శాంతించారు. కానీ ఎమ్మెల్సీ పదవి సైతం వచ్చే అవకాశం కనిపించకపోవడంతో చివరకు తీగల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో మాజీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తీగలను పార్టీలో చేర్చుకుంటే రానున్న జీహెచ్ఎంసి ఎన్నికలలో లబ్ది పొందడంతో పాటు నగరంలో పార్టీ కూడా బలోపేతం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెలాఖరు లోగా తీగల కృష్ణారెడ్డి కమలం గూటికి చేరతాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.