ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాల్లో మార్పులు రావడం లేదు. మహిళల పట్ల అకృత్యాలు ఆపేందుకు నిర్భయ లాంటి చట్టాలు తీసుకువచ్చినా ఏమాత్రం భయపడడం లేదు. హన్మకొండ హంటర్‌రోడ్డుకు చెందిన మానస ఘటన మరువక ముందే వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ రాంనగర్ కాలనీలో యువతి శుక్రవారం సాయంత్రం దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం హన్మకొండ లష్కర్సింగారంకు చెందిన మునగాల హరతిని కాజీపేటకు చెందిన ఎండి.సాహెబ్ దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. హత్య చేసిన అనంతరం జడ్జి ఎదుట సాహెబ్ లొంగిపోయినట్లు తెలిసింది.
హరతి హన్మకొండలోని రాంనగర్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నట్లు, నిందితుడు కూడా అదే కళాశాలలో చదువుతున్నట్లు తెలిసిందన్నారు. ఎండి.సాహెబ్ కాజీపేట చైతన్యపురి కాలనీలో గల ఒక మటన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా హరతి, సాహెబ్‌లు డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకరికొకరు చనువుగా ఉన్నట్లు తెలిసింది. కాగా పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Tags: premonmadhi, college student killed, hanmakonda, harathi, md saheb