Take a fresh look at your lifestyle.

రైతుల సమస్యలపై ప్రపంచం స్పందిస్తోంది

అయినా  పట్టించుకోని ప్రధాని మోడీ: రాహుల్‌
‌వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ బీజేపీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెండునెలలకు పైగా రైతులు దేశ రాజధాని ప్రాంతంలో నిరసనలు చేపడుతున్నా అన్నదాతల గోడును కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాహుల్‌ ‌పేర్కొన్నారు.

కేరళలోని వయనాద్‌లో ట్రాక్టర్‌ ‌ర్యాలీ ముగింపు సందర్భంగా సోమవారం ముత్లిలో రైతులను ఉద్దేశించి రాహుల్‌ ‌మాట్లాడారు. మన రైతుల ఇక్కట్లను యావత్‌ ‌ప్రపంచం చూసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల గోడును ఆలకించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల దుస్థితిపై పాప్‌ ‌స్టార్‌లు మాట్లాడటం చూశాం కాని భారత ప్రభుత్వం ఈ అంశంపై ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. భారత వ్యవసాయ వ్యవస్థను ధ్వంసం చేసేందుకే మూడు వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశారని రాహుల్‌ ‌మండిపడ్డారు. ఈ చట్టాలు మన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి మొత్తం సేద్యం వ్యాపారాన్ని నరేంద్ర మోదీ స్నేహితులైన ఇద్దరి ముగ్గురి చేతిల్లో పెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ చట్టాలతో భారత వ్యవస్ధాయ వ్యవస్థ ఇద్దరి ముగ్గురు చేతుల్లోకి వెళుతుందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిని దోచి కొద్దిమంది సంపన్న స్నేహితుల జేబులు నింపడంలో బిజీగా ఉందని అంతకుముందు రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.

Leave a Reply