Take a fresh look at your lifestyle.

శ్రమైక జీవులు ఏ కాలర్ వారు

“ఉదాహరణకు  కార్పెంటర్, తాపీ మేస్త్రీ వంటి వారికి పట్టణాలు, నగరాలకు వచ్చినా దక్కేది తక్కువే.. అందుకే  ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాల వారు స్వస్థలాల్లోనే పనులు చేసుకుంటున్నారు. వచ్చిన దాంతో  సంతృప్తి పడుతున్నారు. ఇలాంటి వారే నవభారత నిర్మాతలు.   వారూ ఆకాంక్షిత భారత దేశంలో వారే. అయితే,  మైళ్ళ దూరం ప్రయాణించి  సంపాదించే దాని కన్నా స్వస్థలాల్లో పని పాటా చేసుకుని బతికేవారని ఏ కాలర్ శ్రామికులని పిలుద్దాం..”

వైట్ కాలర్, బ్లూ కాలర్, నో కాలర్. మోడీ భారత్ లో శ్రమ జీవుల ను కనుగొనడం కష్టమే శ్రామిక వర్గానికి చెందిన భారతీయులు. మోడీ ,ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం వారి భవిష్యత్ గురించి పట్టించుకోదు.శ్రామికులు ధరించే దుస్తులకు ఉండే కాలర్ల రంగులను బట్టి . వైట్ కాలర్ అనీ, బ్లూ కాలర్ అని మనం సాధారణంగా వర్గీకరిస్తుంటాం. మన జాతీయ రహదారులపై కొనసాగుతున్న వలసలు చూస్తుంటే వింతగానే ఉంటుంది. అలా మైళ్ళకు మైళ్ళు నడుచుకుని వచ్చేవారు ఏ కాలర్ కి చెందిన శ్రమజీవులు. వారి వంటి మీద పూర్తిగా దుస్తులుండవు.అందుకే, వారిని కాలర్ లెస్ కేటగిరీలో చేర్చవచ్చు. వారికి కాలర్ ఎందుకు లేదని మీరు అడగవచ్చు., ఇందుకు తగిన కారణం ఉంది. రోడ్ల మీద వందల కొద్దీ మైళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటారు. వారంతా మన కోసమే పని చేస్తున్నారు. మన జీవితాలు సౌఖ్యవంతంగా ఉండటం కోసం పని చేస్తున్నారు.

ఇటుకలను వాహనాలపైకి ఎక్కిస్తుంటారు. వాహనాల్లోంచి ఇటుకలను దించుతుంటారు నిర్మాణ ప్రదేశాల వద్ద వారు లేనిదే పనిగడవదు. అలాగే, రిక్షా తొక్కేవారూ, తోటల్లో పని చేసేవారూ, బార్బర్లు, సమోసాలు, జిలేబీ, హల్వా అమ్మేవారూ,వీరందరికీ వంటి మీద సరైన చొక్కాలు ఉండవు. బనీన్లు మాత్రమే ఉంటాయి. వీరిని ఏ కాలర్ వారని పిలవాలి అలా అని వారు చేసే చూడలేం. శ్రమశక్తికి ప్రతీకలు వారు. ఇక వలస కార్మికుల సంగతి తీసుకుంటే వారు తమ పిల్లలను కొందరు,నడవలేని పెద్దలను కొందరినీ ఎత్తుకుని తీసుకుని వెళ్ళవారు కనిపిస్తుంటారు. ఆగ్రాకు వెలుపల జాతీయ రహదారిపై ఇలాంటి దృశ్యాలు ఎన్నో. నిజానికి కాలర్ లేని శ్రామిక వర్గమే భారత దేశానికి వెన్నెముక, వందల మైళ్ళు నడిచి వెళ్ళేవారిలో మహిళలు రోడ్లపై ప్రసవిస్తుంటారు. వేగంగా దూసుకుని వచ్చే వాహనాల కింద పడి మరణిస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా ప్రింట్ విలేఖరులు జ్యోతి యాదవ్, బిస్మీ టస్కిన్ రాసిన కథనాలు చదవండి ఇలాంటి వారి అనుభవాలు ఎన్నో, రామ్ కృపాల్ అనే వృద్ధుడు ముంబాయి నుంచి ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ కు లారీలో 1600 కిలోమీటర్లు ప్రయాణించి స్వస్థలం కొద్ది దూరం ఉండగా కుప్పకూలాడు. నాలుగు రోజుల నుంచి ఆకలి దప్పికలతో ఉన్న అతడు ఆ తర్వాత మరణించాడు. అతడికి కరోనా టెస్ట్ లు చేశారు. పోజటివ్ వచ్చింది. ఇలాంటి నిర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు

మనం రోజూ చూసే దృశ్యాలు మాత్రమే కాదు, మన దృష్టికి రానివి ఇలాంటివి ఎన్నో.వీరంతా పేదవారు. దప్పిక తీర్చుకునే తాహతు లేని వారు.వలసలంటే ఉన్న చోట ఉపాధి లభించకపోవడం లేదా. తమ ప్రతిభకు, విద్యకు తగిన ఉపాధి లభించక పోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్శడం అమెరికా, తదితర దేశాలకు వెళ్ళేవారు గ్రీన్ కార్డు , వీసాల కోసం వెళ్ళేవారూ వలసదారులే. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇలాంటి వలస దారులకు అందించే సాయం. సామాన్యులకు అందించడం లేదు. బారత దేశంలో గ్రామాల నుంచి పట్టణాలకూ, నగరాలకూ వలస వచ్చే వారికి రోజుకు మహా అయితే ఐదొందలు, వెయ్యిరూపాయిలు వస్తుంది. ఖర్చులు పోను వారు ఇళ్ళకు పంపిస్తూ ఉంటారు. నైపుణ్యం ఉన్నవారు ఎక్కువ సంపాదించవచ్చు. లేని వారికి దక్కేది చాలా తక్కువ., ఉదాహరణకు కార్పెంటర్, తాపీ మేస్త్రీ వంటి వారికి పట్టణాలు, నగరాలకు వచ్చినా దక్కేది తక్కువే అందుకే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాల వారు స్వస్థలాల్లోనే పనులు చేసుకుంటున్నారు. వచ్చిన దాంతో సంతృప్తి పడుతున్నారు. ఇలాంటి వారే నవభారత నిర్మాతలు. వారూ ఆకాంక్షిత భారత దేశంలో వారే. అయితే, మైళ్ళ దూరం ప్రయాణించి సంపాదించే దాని కన్నా స్వస్థలాల్లో పని పాటా చేసుకుని బతికేవారని ఏ కాలర్ శ్రామికులని పిలుద్దాం..
*శేఖర్ గుప్తా ,’ది ప్రింట్ ‘ సౌజన్యం తో..

Leave a Reply