- యుద్దప్రాతిపదికన పనిచేశారు
- రెండు దశల్లో తొలుత ఫ్రంట్ వారియర్స్‌కు టీకా
- మేకిన్ ఇండియ కల సాకారమైందన్న ప్రధాని
- వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కు,భౌతిక దూరం పాటించాలని పిలుపు
- దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సినేషన్ పక్రియ .. వర్చువల్‌గా ప్రారంభం
- దేశమంటే మట్టి కాదోయ్ అంటూ గురజాడను గుర్తు చేసిన ప్రధాని
కొరోనాను అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా శనివారం వ్యాక్సినేషన్ పక్రియ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇది దేశ చరిత్రలో మరుపురాని రోజుగా అభివర్ణించిన ప్రధాని..శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కొరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను మొదలు పెట్టింది. కొరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న టెన్షన్ ఉండేదని, కొరోనా టీకా వచ్చేసిందని మోదీ అన్నారు. ప్రపంచం అంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిందన్నారు.
వర్చువల్ రీతిలో టీకా పంపిణీ ప్రారంభించిన తర్వాత మోదీ మాట్లాడుతూ.. రాత్రి, పగలు లేకుండా శాస్త్రవేత్తలు టీకా కోసం శ్రమించారన్నారు. చాలా తక్కువ సమయంలో టీకా వచ్చేసిందన్నారు. మేడి ఇన్ ఇండియా టీకాలు రెండు వచ్చాయన్నారు. ఇది భారత సామర్థ్యం అన్నారు. వైజ్ఞానికి సత్తా అన్నారు. భారతీయ టాలెంట్ అన్నారు. ఎవరికైతే అత్యవసరమో.. వారికి ముందుగా టీకా ఇస్తున్నామని అన్నారు. కొరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు నిరంతరంగా శ్రమించారని, వారి కృషి మరువలేనిదన్నారు.