తాండూరు : లాక్ డౌన్ దృష్ట్య్టా పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య విక్రయదారులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడంపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలోని జి పద్మయ ట్రేడర్స్, అదే విధంగా ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ లోని జి నారాయణ ట్రేడర్స్ వ్యాపారులు ఎంఆర్పీ రేటు కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై తనిఖీలు నిర్వహించి వారి షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో మున్సిపల్ జవాన్ హరికృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.