Take a fresh look at your lifestyle.

గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌

‌వికారాబాద్‌ : ‌గిరిజన సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌ అన్నారు. సోమవారం వికారాబాద్‌ ‌మునిసిపల్‌ ‌లోని చంచు కాలనీ 10 వ వార్డు, వికారాబాద్‌ ‌మండలం లోని చంచుపల్లి(మదనపల్లి) గ్రామాల్లో గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన 13 రకాల వస్తువులతో కూడిన ప్యాకెట్లను(500 రూపాయల విలువైనవి) గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు జిల్లా కలెక్టర్‌ ‌పౌసుమి బసుతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

Threatening farmers should chooserawn

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటకు సాగు నీరు పెట్టుబడికి సాయం 24 గంటల కరెంటు, రైతు బీమా వంటి అత్యున్నత పథకాలను తీసుకువచ్చిన మహానాయకుడుగా సీఎం కేసీఆర్‌ ‌చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా పేదరికంలో ఉన్న గిరిజనులు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనే ఉద్యేశ్యంతో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు గిరిజనులకు 13 రకాల వస్తువులతో నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌పౌసుమి బసు మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రమేశ్‌ , ఆర్డీవో ఉపేందర్‌ ‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి కొటాజీ, మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌భోగేశ్వర్లు, పిఎసిఎస్‌ ‌ఛైర్మెన్‌ ‌ముత్యంరెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ ‌టౌన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ప్రభాకర్‌ ‌రెడ్డి, కమల్‌ ‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ ‌దేవి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!