Take a fresh look at your lifestyle.

వోటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి

The voter list,armored,january 1,2020,rajat kumar,hyderabadములుగు : ప్రతి సంవత్సరం రూపోదించే ఓటరు తది జాబితా పకడ్బందీగా రూపోదించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ ‌కుమార్‌ అన్నారు. ఓటరు దృవీకరణ,ఓటరు జాబితా తయారిపై ముఖ్య ఎన్నికల అధికారి మంగళవారం హైదరాబాద్‌ ‌నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియా కాన్పరెన్స్ ‌ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాలో అయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియని, ఓటర్ల నమోదుకు జనవరి 1,2020 ప్రమాణికంగా తీసుకోని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేసామని తెలిపారు.

మరణించిన వారి పేర్లను ఇతర ప్రాంతాలకు తరలి వెల్లిన వారిని గుర్తించి జాబితా నుండి తోలగిస్తు వాటిని ప్రత్యేకంగా రూపోందించాలని అన్నారు.ప్రతి వయస్సు గ్రూపు ఎంత మంది ఉన్నారనే సమాచారిన్ని పకడ్బందీగా సేకరించాలని ఆయన అధికారును అదేశించారు. డిసెంబర్‌ 16,2019 ‌న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఉండే అభ్యంతరాలను ప్రజలు జనవరి 15,2020 వరకు తెలియచేయ్యాలన్నారు. ప్రజల నుండి స్వీరించిన అభ్యంతరాలను ఓటర్‌ ‌క్లెయిమ్స్‌ను జనవరి 27,2020 నాటికి పూర్తి స్థాయిలో తప్పని సరిగా ఎన్నికల కమీషన్‌ ‌మార్గదర్శాకాలను పాటిస్తు పరిస్కరించాలని,పిబ్రవరి 4 లోపు వివరాలు ఎన్నికల సంఘానికి నివేదిస్తు ఎన్నికల సంఘం ద్వారా పైనల్‌ ‌పబ్లికేషన్‌కు అనుమతి తీసుకోని ఫిబ్రవరి 7డాటాను ప్రింటింగ్‌ ‌రూపంలో సప్లమెంటరీ కాపీ విడుదల చేయ్యాలన్నారు.

సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి కె.రమా దేవి మాట్లాడుతూ జిల్లాలో 302 పోలింగ్‌ ‌కేంద్రాలు ఉన్నాయని,2 లక్షల 13వేల 423 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో లక్షా 5వేల 468 మంది పురుషులు ఉండగా లక్షా 7వేల 947 మంది స్త్రీలు ,8 మంది ఇతరులు ఉన్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ముసాయిదా ఒటరు జాబితాపై 143 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. జిల్లాలో జనవరి 18,2020న అసెబ్లీ నియోజకవర్గం వారిగా ఓటరు నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో ములుగు తహశీల్దార్‌ ‌సత్యనారాయణస్వామి,ఎన్నికల డిటి పద్మావతిదేవి తదితరులు పాల్గోన్నారు.

Tags: The voter list,armored,january 1,2020,rajat kumar,hyderabad

Leave a Reply