Take a fresh look at your lifestyle.

ఎక్సైజ్‌ ‌కార్యాలయం ముందు గ్రామస్తుల ఆందోళన

తమ భూమిని చదును చేస్తూ దానిలో ఉన్న ఈత చెట్లను తొలగించిన రైతులపై కేసు నమోదు కాగా వారికి మద్ధతుగా గ్రామస్ధులు ఎల్లారెడ్డిపేట ఎ•క్సైజ్‌ ‌శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్‌కు చెందిన బొమ్మడి రాజలింగం, బొమ్మడి నడిపి రాములు, బొమ్మడి నర్సవ్వ అనే రైతులకు ఒక ఎకరం భూమి ఉంది. ఇట్టి భూమిలో సాగునీరు సరిగా లేకపోవడంతో కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకోలేదు. ఈ సంవత్సరం వ్యవసాయం కోసం వారి సొంత భూమిలో రాజలింగం వ్యవసాయం చేసుకోవడానికి చదును చేసుకున్నాడు. అట్టి భూమిలో రకరకాల చెట్లతో పాటు ఈత చెట్లు కూడా ఉండగా అన్నింటిని తొలగించు కున్నాడు. దాంతో గీతాకార్మికులు ఎక్సైజ్‌ ‌సిఐ కార్యాలయంలో రాజలింగంపై ఫిర్యాదు చేయగా ఎలాంటి విచారణ జరపకుండా రాజలింగంపై కేసు నమోదు చేశామని సమాచారం ఇచ్చారు.

దాంతో గ్రామస్థులు అంతా రైతులకు మద్దతుగా మండల కేంద్రంలోని ఎక్సైజ్‌ ‌కార్యాలయానికి తరలి వచ్చి సిఐని కలవడానికి ఉదయం నుండి మద్యాహ్నం 03.00గంటల వరకు వేచి ఉన్నారు. సిఐకి ఫోన్‌ ‌చేస్తే వస్తున్నానని రాకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు రైతులకు మద్దతుగా కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అయినా కూడా ఎక్సైజ్‌ ‌సిఐ స్పందించడం లేదని రైతుకు అన్యాయం జరిగితే సహించేది లేదని రెడ్డి సంఘం అధ్యక్షుడు దేవారెడ్డి, ముదిరాజ్‌ ‌సంఘం అధ్యక్షుడు రాజు, యాదవ సంఘం అధ్యక్షుడు హన్మడ్లు, రజక సంఘం అద్యక్షుడు దొమ్మాట నర్సయ్య, ఉప్పరి సంఘం అధ్యక్షుడు భూమయ్య, బుడిదె సంఘం అధ్యక్షుడు దుర్గయ్య, ముస్లిం సంఘం ఎండి షాదుల్లా, కుల సంఘ నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply