Take a fresh look at your lifestyle.

గ్రామానికి ఒక వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి- లింగాల ఎస్సై కృష్ణయ్య.

నాగర్‌ ‌కర్నూల్‌,ఆగస్టు20.ప్రజాతంత్రవిలేకరి : పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని లింగాల ఎస్సై కృష్ణయ్య అన్నారు.గురువారం లింగాల పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, లింగాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు, గ్రామ పెద్దలకు మరియు గ్రామ యువకులకు, గ్రామ అధికారులకు లింగాల పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. కరోనావ్యాధి విజృంభిస్తున్న నేపధ్యంలో, కారోనా మహమ్మారి నియంత్రణకై  ప్రతి గ్రామంలోని పెద్దలు అందరూ సమిష్టిగా నిర్ణయించుకొని ఊరికి ఒక్క వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించుకొని పూజించుకోగలరని తెలిపారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని ప్రతి విగ్రహం ఎత్తు 3 ఫీట్ల కంటే తక్కువ ఉండాలని కోరారు.

సౌండ్‌ ‌బాక్సులు, డీజేలు వినాయక విగ్రహాల వద్ద ఏర్పాటు చేయకూడదని తెలిపారు. అవి ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని వివరించారు.మొహరం పండుగ సందర్భంగా పీర్లను ఏర్పాటు చేసుకొని పీర్ల కొట్టం లేదా పీర్ల మసీదులో ఉంచాలని, ఊరేగిం పులు అలయ్‌ ‌బలయ్‌ ‌నిర్వహించరాదని అన్నారు. కరోనా వ్యాధి నిర్మూలనకు సహకరించగలరని కోరారు.ఈ నియమ నిబంధనలను అన్ని కూడా ప్రజా శ్రేయస్సు కోసం ( కరోనా వ్యాధి నిర్మూలనకు) మాత్రమే కానీ ఎవరి సాంప్రదాయాన్ని కానీ ఆచారాలను కానీ వ్యతిరేకించేది కావని అన్నారు.కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుడా,  దాని బారిన పడకుండా ప్రజలందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మరియు మాస్కులు ధరించి పోలీసువారికి సహకరించగలరని అన్నారు.

Leave a Reply