Take a fresh look at your lifestyle.

జిల్లాలో పల్లె ప్రగతి అమలుచేయాలి

The village should be implemented in the district Minister Errebelli
జిల్లాలో పల్లె ప్రగతి అమలుచేయాలి మంత్రి ఎర్రబెల్లి

జిల్లా మనది…పల్లెలు మనవి…ప్రగతి మనది…అనే ఆలోచనతో ప్రజాప్రతి నిధులు, అధికారులు అంకిత భావంతో పనిచేసినపుడే పల్లెలు బాగుపడతాయని పంచాయితి రాజ్‌, ‌గ్రామీణాభివృధ్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం రెండవ విడుత పల్లె ప్రగతి అమలు సన్నాహక సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ‌టి వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షత వహిం చగా పంచాయితిరాజ్‌, ‌గ్రామీణా భివృధ్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలు ఉండొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ ‌పల్లె ప్రగతిని ప్రవేశపెట్టడం జరిగింద న్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు గ్రామాలపై దృష్టి కేంద్రీకరించి రెండవ విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నా రు. ఒకప్పుడు గ్రామాలలో తాగునీరు, సాగునీరు ఉండేది కాదని నేడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు వనరులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని వేసంగి వ్యవసాయం చేసుకోవాలంటే రైతాంగానికి నీరు ఉండేది కాదన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ ‌హయాంలో వేసంగి వ్యవసాయం ఒక పండుగ వాతావరణం కల్పిం చారన్నారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రోజులు పోయాయని నేడు రిజర్వాయర్‌లలో నీరుని నింపుకుని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపడం జరిగిందన్నారు. దీంతో నాడు వ్యవసాయం దండుగ అనుకున్న నుండి నేడు వ్యవసాయం ఒక పండుగ అనే స్థితికి తీసుకొచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఈ సమావేశంలో జెడ్‌పీ చైర్మన్‌ ‌పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘణపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులున్నారు.

Tags: zilla manavi, pallelu manavi, thatikonda rajaiah, errabelli dayakar rao

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply