- ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్న సీఎం కేసీఆర్
- చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్
- బూత్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్న బీజేపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.షెడ్యూల్ ప్రకారం 2023 చివరిలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ అసెంబ్లీకి గడువు ముగియడానికి ఇంకా రెండేళ్లు ఉండగానే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత వారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్త•త స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలనీ, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ హయాంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోనికి తీసుకు వెళ్లాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 80 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి స్థాయి బలం ఉంది. దీనికి తోడు స్థానిక సంస్థలలో సైతం ఆ పార్టీ ప్రజాప్రతినిధులే అధిక శాతం ఉన్నారు. అయితే, రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉంటే ఆ పార్టీపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకతన వస్తుందనేది గతంలో చాలాసార్లు నిరూపితమైంది.
ప్రస్తుతానికి అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టే స్థాయి బలం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేనప్పటికీ ఇప్పుడిప్పుడే ఈ రెండు పార్టీలు బలం పుంజుకోక ముందే సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో కాంగ్రెస్, బీజేపీ ప్రజాక్షేత్రంలోని వెళ్లడానికి కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలంగాణలోనూ విజయవంతం చేయడం ద్వారా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా పేరుతో రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇంకా ఆదరణ తగ్గలేదని నిరూపించారు. అలాగే, యాసంగిలో వరి ధాన్యం కొనేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమించడాన్ని సైతం రేవంత్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్రలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం యాసంగిలో తెలంగాణలో వరి కొనేది లేదంటూ చేసిన ప్రకటకు వ్యతిరేకంగా చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి బాగా అచ్చొచ్చిందనీ, వచ్చే ఎన్నికల కోసం ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. దీంతో రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార టీఆర్‌ఎస్, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుండటంతో బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తున్నది. రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది.
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. త్వరలోనే మరో దఫా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. మొత్తానికి రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా గడువు ముగియడానికి రెండేళ్ల ముందే ప్రధాన రాజకీయ పార్టీల హడావుడితో అప్పుడే ముందస్తు ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది.
——————-
కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా టీకాలలో మార్పులు
తయారీ సంస్థలకు ఎయిమ్స్ చీఫ్ సూచన
అప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని వెల్లడి
న్యూ దిల్లీ, డిసెంబర్ 20 : కొరోనా కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. పూర్తిగా వ్యాక్సినేషన్ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. దీంతో అసలు టీకాలు పనిచేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ ప్రధాన వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య నిపుణుల సభలో ఆయన మాట్లాడుతూ..కొరోనా వైరస్ కొత్త వేరియంట్లపై టీకాలు ప్రభావం చూపకపోవడానికి గల కారణం వైరస్‌లో కొత్త మ్యూటేషన్లు జరగడమేనని అన్నారు.
ఇలాంటి సమస్యను అధిగమించడానికి ప్రస్తుత టీకాలలో కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చన్నారు. అలా చేసుకుంటే వైరస్‌పై టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని అన్నారు. టీకాలు ఒకేసారి భారీ మొత్తంలో తయారు చేయడంకన్నా ఏడాదికోసారి మార్పులు చేసి సరిపడ మొత్తంలో తయారు చేసుకుంటే మంచిదని, ధనిక దేశాలు ఇప్పటికే భారీ మొత్తంలో టీకాలు తయారు చేసి ఉంటే వాటిని పేద, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేస్తే అవి వృథా కాకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
——————
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొన్న బైకు..ముగ్గురు వ్యక్తుల దుర్మరణం
ప్రజాతంత్ర, మెదక్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేగుంట మండల కేంద్రం అనంతసాగర్ రోడ్‌లోని జీవికా పరిశ్రమ నుంచి వొస్తున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పల్లె రాకేష్ (21), అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందారు. పల్లె ప్రదీప్ (17) పండ్ల అరవింద్ (15) మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా, ప్లలె ప్రదీప్ చేగుంట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పండ్ల అరవింద్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరిని ప్రదీప్ అన్న పల్లె రాకేష్ చేగుంటలో బైక్‌పై డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా..జీవిక పరిశ్రమ నుంచి వొస్తున్న లారీని బైకు ఢీకొట్టింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్ద ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.
—————
తెలంగాణ ఎలాంటి విదేశీ రుణాలు తీసుకోలేదు
రేవంత్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూ దిల్లీ, డిసెంబర్ 20 : గత ఐదేళ్లలో తెలంగాణ రాష్టాన్రికి ఏ విదేశీ సంస్థ నుంచి రుణ సహాయం అందలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం మొత్త్మద రూ. 2,37,747 కోట్ల రుణభారం ఉందని, ఇందులో రూ. 2,835 కోట్లు విదేశాల నుంచి తీసుకున్నవేనని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఈమేరకు పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగన ప్రశ్నకు పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో విదేశీ రుణాల రూపంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి అదనపు సహాయం అందలేదు. రూ. 382.21 కోట్ల మేర విదేశీ రుణాలు, రూ. 147.53 కోట్ల మేర వడ్డీ చెల్లింపులను తెలంగాణ ప్రభుత్వం జరిపింది. జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్టక్ష్ర అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ తెలంగాణకు రుణ సహాయం అందించాయి’ అని పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
——————-
మధ్యాహ్న భోజన పథకం వెంటనే పునరుద్ధరించాలి
భోజన కార్మికుల వేతనం పెంచాలి
బండి సంజయ్ డిమాండ్
ప్రజాతంత్ర, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వెంటనే పునరుద్ధ రించాలని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిని ఆపేయడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచి పోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈమేరకు బండి సంజయ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మా పిల్లలు తినే బియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తింటున్నారని పదేపదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ పిల్లలు పస్తులుండటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు.
తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనాన్ని వెంటనే పెంచాలన్నారు. కాగా, మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే ఆహార ధాన్యాలను, వాటి రవాణాకయ్యే ఖర్చునూ 100 శాతం కేంద్రమే చెల్లిస్తోందన్న బండి సంజయ్.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లిస్తున్న గౌరవ వేతనంలోనూ 60 శాతం కేంద్రమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచకుని ఇతర రాష్టాల్ల్రో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచుతూ అందుకయ్యే వ్యయాన్ని అక్కడి రాష్టాల్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల కనీస గౌరవ వేతనాన్ని పెంచాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నారు.
——————–
పేజీ 2 వార్తలు
ఫోటో రైటప్: 20ఎస్‌డిపిటి 22: సోమవారం గజ్వేల్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
గజ్వేల్‌లో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం
ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, డిసెంబర్ 20(ప్రజాతంత్ర బ్యూరో) : యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని యేసు క్రీస్తు తన బైబిల్ బోధనలో చెప్పారని, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వ మతాలను గౌరవిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామనీ, గజ్వేల్ నియోజకవర్గ క్రైస్తవులకు మంత్రి హరీష్‌రావు పవిత్ర క్రిస్మస్ మాస శుభాకాంక్షలను తెలిపారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలలో పాల్గొని, ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలోని 3600 మంది పేద క్రైస్తవ లబ్ధిదారులకు దుస్తుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతీ యేటా క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సాయం అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చేయూత అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేటలో నిర్మించుకుని వినియోగించుకుంటున్నట్లు, త్వరలోనే అన్నీ నియోజకవర్గ పరిధిల్లో కూడా వొస్తాయని మంత్రి పేర్కొన్నారు. గజ్వేల్‌లో చక్కటి క్రిస్టియన్ భవనాన్ని, అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించుకున్నట్లు, క్రైస్తవ పేదలందరికీ అనువయ్యే విధంగా ఈ భవనం నిర్వహణ ఉండాలని నిర్వాహకులను మంత్రి కోరారు. సర్వ మానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని ఆ యేసుక్రీస్తు తమ బైబిల్ బోధనలో చెప్పారని గుర్తు చేస్తూ..అదే విధంగా సీఎం కేసీఆర్ సర్వమతాలను గౌరవిస్తారని, హిందూ దేవాలయాలు అభివృద్ధి జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరే వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. పండుగ ఏదైనా ప్రభుత్వం అన్నీ మతాల వారిని కూడా సముచితంగా చూస్తూ..క్రిస్మస్ పండుగకు కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు, మారుమూల గ్రామ ప్రాంతాల్లోని పేదలందరికీ క్రిస్మస్ కానుక బట్టలు అందేలా ఫాస్టార్లంతా చొరవ చూపాలని మంత్రి కోరారు.
………………………………………………………………………………………………………………………….
నోట్: ఈ వార్తలు మెయిన్ పేజీ కోసం.
………………………………………………………………………………………………………………………..
ఫోటో రైటప్: 20ఎస్‌డిపిటి 25: సోమవారం సిద్ధిపేట జిల్లా బుస్సాపూర్‌లో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల కర్మాగారం ప్రారంభించిన అనంతరం బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి హరీష్‌రావు. చిత్రంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులను చూడవచ్చు.
సిఎన్‌జి ఏర్పాటుకు బలం, బలగం సిద్ధిపేట ప్రజలే…
చెత్తకుప్పలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే బయోగ్యాస్ ప్లాంటు
బుస్సాపూర్‌లో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల కర్మాగారం ప్రారంభంలో మంత్రి హరీష్‌రావు
మంత్రి హరీష్‌రావు వల్లే సాధ్యమైంది: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ అండ్రూ
యావత్ భారతావనికే ఈ ప్రాజెక్ట్ మోడల్‌గా నిలవనుంది: ఎంపి కేపీఆర్
సిద్ధిపేట, డిసెంబర్ 20 (ప్రజాతంత్ర బ్యూరో): బయో-సిఎన్‌జి(కంప్యూటరైజ్డ్ నేచరల్ గ్యాస్) ఏర్పాటుకు బలం, బలగం సిద్ధిపేట ప్రజలేననీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్‌లో 6కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బయోగ్యాస్,సేంద్రీయ ఎరువులు కర్మాగారాన్ని సోమవారం డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి(కేపీఆర్), జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మునిసిపల్ ఛైర్‌పర్సన్ కడవేర్గు మంజుల-రాజనర్సు, కమిషనర్ కెవి.రమణాచారితో కలిసి మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. చెత్తను తడి, పొడి, హానికర చెత్తను ప్రజలు విభజన చేయడం వల్లే బయో – సిఎన్‌జి ఏర్పాటు సాధ్యమైందన్నారు. ప్రపంచం మొత్తం చెత్తతో బాధపడుతుందనీ, ల్యాండ్ ఫిల్లింగ్‌తో భూమి, నీరు కలుషితం అవుతుందనీ, అనేక అనారోగ్యాలకు హేతువు మారుతుందన్నారు. గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయి ఉండేవనీ, చెత్తకుప్పలు ఉండకూడనద్న ఉద్దేశంతో బయో-సిఎన్‌జి ప్లాంటును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు సిద్దిపేట పట్టణంలో 55 వేల కిలోల చెత్త ఉత్పత్తి అవుతుందనీ, ప్రజా భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో… స్వచ్చ పట్టణంగా సిద్దిపేటను మారుస్తున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్త కాకుండా హానీకర చెత్తను ఇన్సులెటర్‌లో అత్యధిక టెంపరేచర్‌లో మండిస్తున్నామన్నారు. 6సంవత్సరాల కృషి తో స••స్థిర పట్టణంగా సిద్దిపేట చేస్తున్నామన్నారు. చెత్తను కుప్పలుగా పోయని దేశంలోనే తొలి పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ది అంటే …. ఆరోగ్య వాతావరణంలో జీవించేకలిగే పరిస్థితులను సృష్టించడం లక్ష్యమన్నారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నామనీ, బయో-సిఎన్‌జిని పట్టణంలో రెస్టారెంట్లకు సరఫరా చేస్తామనీ, మునిసిపల్ వాహనాలకు ఇంధనంగా బయో – సిఎన్‌జి గ్యాస్‌ను ఉపయోగిస్తామన్నారు. సేంద్రీయ ఎరువులను రైతులకు ఎరువుగా అందిస్తామనీ, పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కంటే ఆరోగ్యంను ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఆరోగ్య సిద్దిపేట తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సఫాయి అన్న సలాం అన్నాడన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట పట్టణం 14జాతీయ స్థాయి అవార్డులు, 4రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులను సిద్దిపేట చేజిక్కించుకోవడంలో సఫాయిలు ముఖ్య పాత్ర వహించారన్నారు. తెలంగాణ ఉద్యమంకు సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధికి కూడా దిక్సూచిగా నిలపాలన్నారు. నిరంతర కృషి, ఉద్యమ స్పూర్తి ఉంటేనే దేశానికే అభివృద్ధికి దిక్సూచిగా సిద్దిపేట మారిందన్నారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… తెలంగాణలోని 33 జిల్లాల్లో స్వచ్చత విషయంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందనీ, ఇదంతా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దూరదృష్టితోనే సాధ్యమైందన్నారు. బయో-సిఎన్‌జి ప్లాంట్ ద్వారా ఇండియాలోనే జీరో ల్యాండ్ ఫిల్లింగ్ పట్టణంగా సిద్దిపేట మారనుందనీ, వ్యర్థంను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయమన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు నా అభినందనలు, శుభాకాంక్షలు అన్నారు. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి(కేపీఆర్)మాట్లాడుతూ.. దేశంలోనే బెస్ట్ మున్సిపాలిటీగా సిద్దిపేట అవతరించనుందనీ, యావత్ భారతావనికే ఈ ప్రాజెక్ట్ మోడల్‌గా నిలవనుందన్నారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ తోనే 100 రోజుల్లోనే బయో-సిఎన్‌జి ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్‌ను మంత్రి హరీష్‌రావు శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.
……………………………………………………………………………………………………………………………