Take a fresh look at your lifestyle.

కోవిన్‌ ‌పోర్టల్‌లో రిజిస్టర్‌ ‌చేసుకున్నవారికే టీకా

  • కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌కు సిద్ధం
  • వారానికి నాలుగు రోజులు పంపిణీ
  • రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు

కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు స్పష్టం చేశారు. గురు, శుక్రవారాల్లో 1,200 కేంద్రాల్లో డ్రై రన్‌ ‌నిర్వహిస్తామని తెలిపారు. కో-విన్‌ ‌పోర్టల్‌లో రిజిస్టర్‌ ‌చేసుకున్న వారికే టీకా వేస్తామని పేర్కొన్నారు. వారానికి నాలుగు రోజులు కోవిడ్‌ ‌టీకాల పంపిణీ చేపడుతామన్నారు. బుధ, శనివారాల్లో మిగిలిన టీకాల పంపిణీ ఉంటుందన్నారు. వందకు పైగా ప్రయివేటు హాస్పిటళ్లలో టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. టీకాల కోసం ప్రజలు ముందుగా రిజిస్టర్‌ ‌చేసుకొనేందుకు కో-విన్‌ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

త్వరలోనే మొబైల్‌ ‌యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. ఈ రెండు మార్గాల ద్వారా సామాన్యులు నేరుగా రిజిస్టర్‌ ‌చేసుకోవచ్చు. ముందుగా కో-విన్‌ ‌పోర్టల్‌ ఓపెన్‌ ‌చేయగానే రిజిస్ట్రేషన్‌ అనే ఆప్షన్‌ ‌వొస్తుంది. అందులో ఆధార్‌ ‌నంబర్‌ ‌నమోదు చేయాలి. సరైన నంబర్‌ అయితే వెంటనే మి పేరు, శాశ్వత చిరునామా తదితర వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. ఆ వెంటనే ఆధార్‌ ‌నంబర్‌తో నమోదై ఉన్న మొబైల్‌ ‌నంబర్‌కు వన్‌ ‌టైం పాస్‌వర్డ్ ‌వొస్తుంది. దానిని ఎంటర్‌ ‌చేయాలి. ఆ తర్వాత ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ ‌చేయగానే రిజిస్ట్రేషన్‌ ‌పూర్తయినట్టు చూపిస్తుంది. ఆధార్‌ ‌కార్డుపై ఉన్న చిరునామాలు లేనివారు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, పుట్టిన తేదీలను స్వయంగా కూడా ఎంటర్‌ ‌చేయవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత ‘డెమో అథెంటికేషన్‌’ అనే ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆకుపచ్చ టిక్‌తో రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ పూర్తయినట్టు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ పూర్తికాగానే ఎప్పుడు? ఎక్కడ? వి•కు టీకా వేస్తారు అనే వివరాలతో కూడిన సందేశం మి మొబైల్‌ ‌నంబర్‌కు వొస్తుంది. కో-విన్‌లో రిజిస్టర్‌ ‌చేసుకోకుండా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లినా వేయరు.

ప్రస్తుతం ఈ సాప్ట్‌వేర్‌లో ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్ ‌వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. సామాన్య ప్రజల వివరాల నమోదుపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎవరికి వారు ఈ పోర్టల్‌ ‌లేదా యాప్‌లో పేరును స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. దానిని బట్టి టీకా వేసే సమయాన్ని కేటాయిస్తారు. ఏయే కేంద్రాల్లో టీకాలు ఎప్పుడు వేయాలి? ఎన్ని సెషన్లలో ఎంతమందికి వేయాలన్న అంశాలను జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుంది. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాయంతో కలెక్టర్‌ ‌టీకా సెషన్‌ను ఖరారు చేస్తారు. టీకా కేంద్రాలు, టీకాలు వేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, టీకా వేసుకొనేవారు ఎవరు అనే విషయాలపై తుది నిర్ణయం కలెక్టర్‌దే. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను టీకాలు వేసే సెషన్‌ ‌సైట్‌లుగా ఉపయోగిస్తారు. మారుమూల ప్రాంతాల్లో అయితే పాఠశాలలు,  కమ్యూనిటీ హాళ్లను కూడా ఇందుకోసం వాడుకొంటారు. టీకా కేంద్రంలో మూడు గదులు ఉంటాయి.

1. వెయిటింగ్‌ ‌రూం

2. వ్యాక్సినేషన్‌ ‌రూం,

3. అబ్జర్వేషన్‌ ‌రూం.

Leave a Reply