Take a fresh look at your lifestyle.

విశ్వమే ఒక స్మశానం

ప్రపంచం ప్రశాంతంగా ఉందని
అర్ధ రాత్రి
ఆకాశంపైకి నిచ్చెనేసి
చుక్కల మధ్య కాసేపు కుర్చున్నా.!

పేక మేడల్లా
పెల్లు పెల్లునా విరిగి కూలుతున్న
సరిహద్దు గోడలు!
ప్రళయ విధ్వంసక శబ్దాలు.

గజగజా వణుకుతూ
ప్రాణాలను అరచెతిలో పెట్టుకుని
పరుగు పరుగున
పరుగెడ్తున్న మనిషి…!

పాలపుంతల దిక్కులు జూసి
గ్రహాల గ్రహాలకూ
మద్య దూరం కొలిసి
విశ్వంపై రాకెట్‌
‌నిల్పిన మనిషి!. వీడు

ఒక్క మాసంలో
ఒక్క  రోజులో
ఒక్క క్షణంలో
ఎంతలో ఎంత
మార్పూ.?

నాగరికథ తొలినాళ్ళల్లో
రాతిపొరల గుండెచ్చప్పుడు విన్న మనిషీ..

మట్టి ధూళిపై పాద ముద్రలను
ఎందుకు చెరిపెసుకున్నాడో.!
తన నుండి తానేందుకు
విడువడిపోయాడో.

భూమికి కొలతలు గీసి
నింగి నెలకు లెక్కలు రాసి
ఎన్ని ఎన్నెన్ని సార్లు
యుద్దం చెశాడో.

ఎన్ని సార్లు
భూమి గుండెని
చీల్ఛీ
గెలిచానని అరిచాడో.

కొండలను గుట్టలను
కూలదోచి
సంద్రాన్ని బంధించ్చి
మట్టిని మారుబేరంతో
ఎక్కడెక్కడ తూకం వేశాడో.

వనంలో అణువణువు గాలించి
చెట్టుచెట్టుకు శీలపరిక్ష చేసి
అడవికి ఉరితాడెసి
నిర్దాక్షి•ణ్యంగా
ఎన్నిసార్లు కుతుక పిస్కి
ఊపిరి తీసాడో.

ఈ అనంతపు విశ్వపుగదిలో
నేత్తురోడుతు
గాయాలతో రోదిస్తున్న
మనిషీ…..కి

ఇప్పుడు
ఇప్పటికిప్పుడు
ఏ……ఆకు
పసరు వైద్యం చేస్తది
ఏ ప్రకృత్తి
ప్రాణం పోస్తది

ఐసోలెషన్‌ ‌వార్డో

శ్వాస  నిచ్వాసల మధ్య
పసికూనలా ఎడుస్తున్న
మనిషి….కి
కంటనీరు తుడ్చి గుండె బరువు కొలిచి

యీ కాలం ఎప్పుడు
గాయం మాన్పుతుందో.!

భూ గ్రహం మొత్తం
కరోన పీడిత గ్రహంగా మారిందిప్పుడు.!
మృత్యువు నాల్కలు సాచి
మనిషికి మరణదండన విధిస్తుందిప్పుడు.

యిప్పుడు విశ్వమే ఒక స్మశానం.!!

యీ మట్టిపై
మనిషిని
తిరిగి మరల బ్రతికిందెవరు.!

 – జూపల్లియాది,
8520839767

Leave a Reply