Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో ఇంటర్నెట్‌ ‌నుండి తొలిగించారు: పొన్నాల లక్ష్మయ్య

The TRS Manifesto Was Removed from the Internet
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

ప్రజాతంత్ర ,హైదరాబాద్‌: టీఆరెస్‌ ‌మేనిఫెస్టో ను ఇంటర్నెట్‌ ‌నుండి తొలగించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.కాంగ్రెస్‌ ‌పార్టీ మానిఫెస్టో ఇంకా ఇంటర్నెట్‌ ‌లోనే ఉందని, నా ప్రశ్నలకు సమాధానాలు చెబితే మీకు దమ్ము ధైర్యం ఉన్నట్లే అన్నారు.శనివారం గాంధీభవన్‌ ‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ….ఎన్నికల ముసాయిదా అంటే భగవత్‌ ‌గీత అన్నారు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.టి ఆర్‌ ఎస్‌ ‌మానిఫెస్టో పై కే సి ఆర్‌ ‌చర్చకు రావాలని సవాల్‌ ‌విసిరారు.ఈ ప్రభుత్వానికి మాటలు తప్ప చేతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.చట్ట •బద్ద పాలనా అంటున్న కేసీఆర్‌ ఇం‌దిరా పార్కు లో ధర్నా లు నిషేధించారని ధ్వజమెత్తారు.

కరీంనగర్‌ ‌ను లండన్‌ ‌చేస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు ..?హుజూర్‌ ‌నగర్‌ ఎన్నికల్లో కాళేశ్వరంనీళ్ళుఅని చెప్పి మోసం చేశారని,ఇలా ప్రజలను మోసం చేయడం ఎల్లకాలం కుదరదని తెలిపారు.కాంగ్రెస్‌ ‌పార్టీ అధికరంలో ఉన్నపుడు 80 శాతం హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అం‌టే కల్వకుంట్ల ప్రాజెక్ట్ ‌గా మార్చారన దేవుళ్ళ పేరు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపించారు.బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంటే ఇంకా ఇందిరమ్మ ఇళ్లే చూపిస్తున్నారని తెలిపారు .

Tags: The TRS Manifesto,Removed, Internet, pcc ex ponnala laxmaiah

Leave a Reply