ఆధారాలతో సహా బయటపెడతాం: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. ప్రాజెక్టులు, పథకాల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులే రాష్ట్రంలో అమలమవుతున్నాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై టీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆచరణ సాధ్యం కాని హాలే తమకు ఆయుధమన్నారు. వరంగల్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ. కేంద్ర నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప కొరోనా సమయంలో ఏ ఒక్క పథకమయినా కెసిఆర్ ప్రారంభించారా అని సంజయ్ ప్రశ్నించారు.
ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. కేవలం కేంద్రం ఇచ్చే డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలావుంటే ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పని అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అక్రమాలను అడ్డుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు ఆయన వరంగల్ వస్తున్న క్రమంలో ఆపదలో ఉన్నవారికి సాయమందించారు. బండి సంజయ్ గురువారం వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పున్నం రమేష్, పున్నం రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్ పై హుజురాబాద్ నుండి కరీంనగర్‌కు వెళ్తుండగా..అదుపుతప్పి కింద పడ్డారు. దాంతో వారికి తీవ్రంగా గాయలయ్యాయి. అది చూసిన సంజయ్..తమ కాన్వాయ్‌ను ఆపి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిని చికిత్స కోసం ఆయన సొంత కారులోనే కరీంనగర్ హాస్పిటల్‌కి పంపించారు.