Take a fresh look at your lifestyle.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగుస్తున్న ఉచ్చు

  • నిబంధనలకు విరుద్దంగా అఫిడవిట్‌ ‌సమర్పణ
  • వెబ్‌సైట్‌ ‌ట్యాంపర్‌ ‌చేసి సవరించిన అఫిడవిట్‌ అప్‌లోడ్‌
  • ‌ధృవీకరించిన ఎన్నికల అధికారి శశాంక్‌ ‌గోయల్‌

హైదరాబాద్‌,‌ జనవరి 25 :  ‌తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఉచ్చు  బిగుస్తోంది. 2018 మహబూబ్‌ ‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌ అ‌క్రమాలకు పాల్పడినట్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను  శ్రీనివాస్‌గౌడ్‌ ‌వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేశారు. లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్‌ను వైబ్‌సైట్‌ ‌నుంచి తొలగించి దాదాపు నెలన్నర తరువాత సవరించిన అఫిడవిట్‌ను అప్‌ ‌లోడ్‌ ‌చేసినట్లు శ్రీనివాస్‌గౌడ్‌పై ఆరోపణ ఉంది. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కయిన శ్రీనివాస గౌడ్‌ ఈసీ వెబ్‌ ‌సైట్‌ను ట్యాంపరింగ్‌ ‌చేసినట్లు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌నివేదిక తెప్పించుకుంది.

నివేదిక పంపిన కొద్ది రోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్‌ ‌గోయల్‌  ‌బదిలీపై వెళ్లారు. ట్యాంపరింగ్‌ ‌జరిగిన విషయం నిజమేనంటూ శశాంక్‌ ‌గోయల్‌ ‌నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్‌ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌విచారణ జరిపిస్తోంది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్‌ ‌బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోంది.  గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌చర్యలు చేపట్టింది. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌బాధితులు ఈసీకి ఫిర్యాదు చేశారు. 14.11.2018న మహబూబ్‌ ‌నగర్‌ అసెంబ్లీ సీటుకు శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు.  ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ ‌కేసులతో కూడిన వివరాలతో శ్రీనివాస్‌ ‌గౌడ్‌ 14.12.18‌న అఫిడవిట్‌ను సమర్పించారు.

శ్రీనివాస్‌గౌడ్‌ ‌సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను వెంటనే ఈసీ తమ వెబ్‌ ‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.  పోలింగ్‌ ‌పూర్తయి, ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు కొత్త అఫిడవిట్‌ ‌ప్రత్యక్షమైంది. 19.11.2018 తేదీతో కొత్త అఫిడవిట్‌ ఎన్నికల కమిషన్‌ ‌వెబ్‌ ‌సైట్‌లో దర్శనమిచ్చింది. అనర్హత వేటునుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను తెలంగాణ ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్‌లోడ్‌ ‌చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply