Take a fresh look at your lifestyle.

మొత్తం 1071కి చేరిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య

  • సామాజిక దూరం పాటించడమే మందు
  • ఈశాన్య రాష్టాల్రకు వైద్య పరికరాల సరఫరా
  • బరేలీలో వసలకార్మికులపై  స్ప్రే చేసిన వారిపై చర్యలు
  • వివరాలు వెల్లడించిన లవ్‌ అగర్వాల్‌

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 92 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1071కి చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారి లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. ఈశాన్య రాష్టాల్రకు వైద్య పరికరాలను అందించేందుకు ఈశాన్య అభివృద్ధి శాఖ కార్గో విమానాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 3.34 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 60వేల పర్సనల్‌ ‌ప్రొటెక్టివ్‌ ‌కిట్లను ప్రొక్యూర్‌ ‌చేసింది. రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ సుమారు పదివేల కిట్లను ఏర్పాటు చేస్తున్నది. బరేలీలో వలస కూలీలపై డిస్‌ఇన్‌ఫెక్టాంట్‌ ‌చల్లిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించాలని లవ్‌ అగర్వాల్‌ ‌కోరారు. ఇదొక్కటే మందని అన్నారు,. కరోనాకు మందు లేనందున ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి.. లోకల్‌ ‌ట్రాన్స్‌మిష్‌ ‌స్టేజ్‌లోనే ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ‌దశకు వెళ్తితే, దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి కేసులు ఏ లేవని లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూడాలని అన్ని రాష్టాల్ర, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లా మెజిస్టేట్లక్రు, పోలీసులు ఆదేశాలు జారీ చేశామని కేంద్ర హోమ్ శాఖ అధికారి పీఎస్‌ శ్రీ‌వాత్సవ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38 వేల 442 కేసులకు ల్యాబ్‌ ‌పరీక్షలు చేపట్టినట్లు ఐసీఎంఆర్‌ ‌డైరక్టర్‌ ఆర్‌. ‌గంగాఖేడ్కర్‌ ‌తెలిపారు.

నిన్న ఒక్కరోజే 3501 మందికి పరీక్షలు జరిపినట్లు ఆయన తెలిపారు. తమ సామర్థ్యం కన్నా 30శాతం తక్కువే పని జరుగుతోందన్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో గత మూడు రోజుల్లో 1334 పరీక్షలు మాత్రమే జరిగినట్లు ఆయన తెలిపారు. ఇకపోతే సోమవారం ఒక్కరోజే తమిళనాడులో 17 పాజిటివ్‌ ‌కేసులు నమెదయ్యాయి. తాజాగా పశ్చిమబెంగాల్‌, ‌గుజరాత్లలో ఈ మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 32కి చేరింది. ఈ వైరస్‌ ‌కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా మహారాష్ట్ర 6, గుజరాత్‌ ‌లో6 నమోదు కాగా, కర్ణాటక 3, మధ్యప్రదేశ్‌ 2, ‌ఢిల్లీ 2, పశ్చిమ బెంగాల్‌ 2, ‌జమ్మూకశ్మీర్‌ 2 ‌మృత్యువాత పడ్డారు. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్టాల్ల్రో ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా మహారాష్ట్రలో 215 నమోదు కాగా.. కేరళలో 202 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటిరకు 83 కేసులు, తెలంగాణలో 70, ఉత్తరప్రదేశ్‌, ‌ఢిల్లీ రాష్టాల్ల్రో 72 కేసులు, గుజరాత్‌లో 69, రాజస్తాన్‌లో 60 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదవ్వడంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 67కి చేరింది. ఇక పంజాబ్‌ ‌కరోనా బాధితుల సంఖ్య 39 నమోదవ్వగా, హర్యానా 35, జమ్మూకశ్మీర్‌ 41, ‌మధ్యప్రదేశ్‌ 47, ఆం‌ధప్రదేశ్‌ 21, ‌పశ్చిమ బెంగాల్‌ 21, ‌లడఖ్‌ 13, ‌బీహార్‌15, అం‌డమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో 10 కేసులు నమోదయ్యాయి. చంఢీగర్‌ 8, ‌ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌లలో ఏడు కేసులు నమోదయ్యాయి. గోవా 5, హిమాచల్‌‌ప్రదేశ్‌ 3, ఒడిశా 3, పాండుచ్చెరి, మిజోరం, మణిపూర్‌లలో ఒక్కో కరోనా పాజిటివ్‌ ‌కేసు నమోదయ్యింది.

ఇదిలావుంటే 21 రోజుల లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన లేదని సోమవారం కేంద్ర కాబినెట్‌ ‌కార్యదర్శి రాజీవ్‌గౌబా స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 14 ‌తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. దేశవ్యాప్తంగా అమల్లోఉన్న లాక్‌డౌన్‌ ‌కారణంగా, వేలాదిమంది వలస కార్మికులు నిరాశ్రయులయ్యారు. వారంతా తమ స్వస్థలాలకు పయనమవ్వగా, సరిహద్దులో వారిని ఆపేస్తున్న సంగతి తెలిసిందే. వలస కార్మికులను ఆదుకొని వారికి ఆహార వసతి కల్పించాల్సిందిగా మంత్రి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కాగా ఇప్పటికే పలు రాష్టాల్రు తమ సరిహద్దులను మూసి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉంచిన వారు నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నగరాల్లో ప్రజల కదలికల్ని గమనిస్తూ లాక్‌డౌన్‌ను విజయవంతంగా కొనసాగించాలని రాజీవ్‌గౌబా వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను, డీజీపీలను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply