
నర్సంపేట: టిప్పర్ గొర్రెల మందపై దూసుకెళ్లడం తో దాదాపు 100కి పైగా మృత్యువాత పడ్డాయి. శుక్రవారం తెల్లవారుఝామున అక్రమంగా మట్టి రవాణా చెసే టిప్పర్ డ్రైవర్ అతివేగంగా, మద్యం మత్తులో నడిపినట్లు గొర్రెల కాపరులు తెలుపుతున్నారు. మండల కేంద్రం సమీపంలోని 365జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెల మందపై నుంచి మట్టి లారీ దూసుకుపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాయి.వివరాల్లోకి వెళ్తే..నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేపుకోవడం కోసం ఆరునెలల క్రితం కొత్తగూడ మండలంలోని అడవికి వెళ్లారు. తమ గ్రామంలో వరికోతలు పూర్తవుతుండడం వల్ల రాత్రి సమయంలో రవాణా వ్యవస్థ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటికి బయలుదేరారు. రాత్రి దాదాపు రెండు గంటల సమయంలో ఖానాపురం మండలం-నర్సంపేట మధ్యలో ఉన్న బ్రిడ్జి పైకి గొర్రెలు వచ్చే సమయానికే వెనుక నుంచి మట్టి లారీ గొర్రెల మందపై నుంచి దూసుకుపోయింది. ఆ సమయంలో దాదాపు ఆరువందల గొర్రెలు ఉండగా అందులో 100కి పైగా మృతి చెందాయని, మరో యాభై లేవలేని స్థితిలో ఉన్నాయని గొర్రెల కాపరులు తెలిపారు. గొర్రెల మందలో సూడి గొర్రెలు ఉన్నాయని, లారీ డీకొట్టడంతో కడుపులో నుంచి పిల్లలు బయటపడ్డాయని వారు విలపించారు. దాదాపు 20 లక్షల వరకు నష్టం ఉంటుందని, తమకు ఈ గొర్రెలు తప్ప మరో ఆధారం లేదని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాదితులు జాతీయ రహదారి పై రాస్తా రొకో, డర్నా నిర్వహించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడం తో ట్రాఫిక్ అంతరాయం కలిగినది. నర్సంపేట రూరల్ సీఐ సతీశ్ బాబు సంఘ టణ స్థలం వద్దకు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది పరామర్శ.
అర్థరాత్రి సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని గొర్రెల గుంప మీదుగా పోనించడంతో సుమారు వందల గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఖానాపూర్ గ్రామ సమీపంలో మెయిన్ రోడ్ బ్రిడ్జి వద్ద జరిగిన సంఘటనకు స్థలానికి చేరుకుని,ఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఎంపీపీ ప్రకాష్ రావు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Tags: narsampet road accident, sheeps died in accident, mla pedhi