Take a fresh look at your lifestyle.

జమ్మూ ప్రజలను పక్కన పెట్టే సమయం ముగిసింది

  • ఇప్పుడు కాశ్మీర్‌ ‌మరియు జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయి
  • జమ్ము కాశ్మీర్‌ ‌పర్యటన సందర్భంగా కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

జమ్మూ ప్రజలను పక్కదారి పట్టించే సమయం ముగిసిందని, ఇప్పుడు కాశ్మీర్‌ ‌మరియు జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ఆదివారం జమ్మూలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. మూడు రోజుల జమ్మూ కాశ్మీర్‌ ‌పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన తర్వాతనిక్కడికి రావడం మొదటిసారి. భగవతి నగర్‌ ‌ప్రాంతంలో జరిగిన ర్యాలీలో హోంమంత్రి ప్రసంగిస్తూ, జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధికి ఇప్పుడు ఎవరూ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరని అన్నారు.

కేంద్రపాలిత ప్రాంతానికి ఇప్పటికే 12,000 కోట్ల విలువైన పెట్టుబడులు వొచ్చాయని, 2022 చివరి నాటికి మొత్తం 51,000 కోట్లని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధిలో యువత చేరితే, ఉగ్రవాదులు ఉగ్ర చర్యల్లో  విఫలమవుతారని ఆయన నొక్కిచెప్పారు. జమ్మూ కాశ్మీర్‌ ‌హింసలో ఏ పౌరుడూ చనిపోవద్దని, ఉగ్రవాదం నిర్మూలించబడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హోంమంత్రి చెప్పారు.

అంతకుముందు గట్టి భద్రత మధ్య ఆయన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ (ఐఐటి) జమ్మూ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అమిత్‌ ‌షా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్‌, ‌ధర్మేంద్ర ప్రధాన్‌ ‌మరియు జమ్మూ కాశ్మీర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హాలతో కలిసి శ్రీనగర్‌ ‌నుండి జమ్మూ విమానాశ్రయానికి చేరుకుని ఐఐటి-జమ్మూ కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభించారని వారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా మరియు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి షా మధ్యాహ్నం ర్యాలీలో ప్రసంగించిన తర్వాత గురుద్వారాను సందర్శించారని అధికారులు తెలిపారు.

Leave a Reply