Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌కంచె తగిలి పులి మృతి

వండుకు తిన్న దుండగులు
ఒంగోలు, ఫిబ్రవరి 20 : విద్యుత్‌ ‌కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్‌ ‌కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సవి•ప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Leave a Reply