Take a fresh look at your lifestyle.

ముచ్చటగా మూడు రాజధానులు గవర్నర్‌ ‌ప్రసంగంలో మరోమారు ప్రస్తావన

అమరావతి,జూన్‌ 16 :  ‌గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బ్జడెట్‌ ‌సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ‌ప్రసంగించారు. ఈ సందర్భంగా 3 రాజధానుల అంశం గురించి మాట్లాడారు. మా పాలనలో పరిపాలన వికేంద్రికరణ కీలక అంశం. మూడు రాజధానులు కలిగి ఉండే అవకాశం. శాసనం పక్రియలో ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని గవర్నర్‌ ‌ప్రసంగించారు.  బ్జడెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో తొలిసారి ఆన్‌లైన్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

అయితే ఈ సారి కరోనా మహమ్మారి నేపథ్యంలో గవర్నర్‌ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన ఆన్‌లైన్‌ ‌ద్వారానే ఎపి బ్జడెట్‌ ‌సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ఆన్‌లైన్‌ ‌ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం అనేది దేశంలో ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా  స్వచ్ఛమైన, అవినీతిరహిత మైన పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే రివర్స్ ‌టెండరింగ్‌ ‌విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామని గుర్తుచేశారు. అలాగే మూడురాజధానుల విషయాన్ని ప్రస్తావించారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Leave a Reply