తగ్గుతున్న పొలిటికల్ గ్రాఫ్
రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి
గూడెం పాల్ అంటూ సెటైర్లు
కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్ రావు. మనసులోని రాజకీయ కాంక్షకు సేవ ముసుగు తొడిగి ప్రజల ముందుకు వచ్చారు. అవకాశం వస్తే గాని అసలు రంగు బయటపడదు అన్న నానుడి ఉంది. సేవా ముసుగులో ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు అనే అరోపణలు వినిపిస్తున్నాయి. సేవా కార్యక్రమాలు చేపట్టి సంవత్సరం దాటిందో లేదో అవకాశం దొరికిన ప్రతిసారి మనసులోని మాట బయట పెట్టేస్తున్నారు. రాజకీయ నాయకుడిని కావాలనే ఉత్సుకతలో ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా నోరు పారేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనే సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. తన రాజకీయ అరంగేట్రానికి అనువుగా మార్చు కోవాలి. కానీ గడల మాటలు ఈ విధానాలనే ప్రశ్నిస్తున్నట్లు ఉంటున్నాయి. ట్రస్ట్ పేరుతో సేవా ముసుగులో దిగజారిన రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు డిహెచ్. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామంలో వాలీబాల్ పోటీల సందర్బంగా ఆదివారం హెల్త్ డైరెక్టర్ గడల చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఇక రిటైర్మెంట్ తీసుకోండి ఎమ్మెల్యే వనమా అంటూ చేసిన కామెంట్స్‌తో అధికార పార్టీ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గడల రగిల్చిన రాజకీయ వేడి ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో రగడ రాజేస్తోంది. గత ఎన్నికల్లో చివరి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే వనమా ప్రజలను కోరారని గుర్తు చేస్తూ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలని పరోక్షంగా అన్నారు. దీనితో గత కొంత కాలంగా గడల చేస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోని బిఆర్‌ఎస్ నాయకులు ఈ సారి మాత్రం ఘాటుగా స్పందిచారు.
తగ్గుతున్న పొలిటికల్ గ్రాఫ్
సిఎం కప్ క్రీడల నిర్వహణలో పాల్గొనాల్సింది పోయి ట్రస్ట్ పేరుతో ముందు రోజు వాలీబాల్ పోటీలు నిర్వహించడాన్ని అధికార పార్టీ నాయకులు తీవ్రంగా తప్పపడుతున్నారు. సిఎం ఫోటో అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే గడల సిఎం పేరుతో నిర్వహించే పోటీలకు సహకారం అందించకుండా రాజకీయ క్రీడలకు తెరలేపుతున్నారని ఆగ్రహిస్తున్నారు. ఓ ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి సిఎం క్రీడలకు బదులు సొంతంగా పోటీలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ స్థానిక నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం ఎందు చర్యలు తీసుకోడం లేదంటూ ప్రతిపక్షాలు సైతం నిలదీస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తున్న గడల జిల్లాలో ఎన్ని సార్లు ప్రభుత్వ దవాఖానాలను తనిఖీ చేశారని, కంటి వెలుగు కార్యక్రం, న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రస్తావించకపోడం అందరిని విస్మయానికి గురిచేస్తున్న అంశము.
సిఎం కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా వచ్చేలా చేస్తే వాటికి విరుద్దంగా అసలు కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు అన్నట్లు గడల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు అంటున్నారు. గడల విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతుండంతో ప్రభుత్వ పెద్దలకు సైతం తలనొప్పిగా మారిందంటూ రాజకీయ వర్గల్లో చర్చ జరుగుతుంది. దీనితో అధిష్టానం కూడా గడల వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రతిసారి గడల తీరు వివాదస్పదం అవుతుండటంతో అటు ప్రజల, ఇటు పార్టీ క్యాడరల్‌లో ఆయనై నమ్మకం సన్నగిల్లుతోంది. దీనితో గడల పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోతోంది.
రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి
వివాదస్పద వ్యాఖ్యలు పరిపాటిగా మారిన డిహెచ్ గడల శ్రీనివాస్ రావు తీరుతో విసిగిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు డిహెచ్ పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిజైన్ చేసి రాజకీయాలు చేయాలని డిమాండ్ చేశారు. గడల మాటలు వింటుంటే కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాలలో గూడెం ఎమ్మెల్యే పదవీ కాంక్షతో మతిలేకనా, మితిమీరి మాట్లాడుతున్నారో తెలియడం లేదని సన్నిహితులు వాపోతున్నారు. క్రీడలతో రాజకీయాలను ముడిపెట్టి అసంబద్దంగా మాట్లాడటం మీద అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఓ రాజకీయ నాయకుడిలా ప్రచారం చేయడము ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగి అయి క్రీడల పేరుతో రాజకీయం ఏంటని వెదవి విరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు కలసికట్టుగా పనిచేయాల్సింది పోయి గులాబీ నేతలకే ముళ్ళుగా గడల మారారు అంటూ అధికార పార్టీ నేతలు వాపోతున్నారు. పార్టీ జెండా పక్కనపెడుతూ సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వివాదస్పద వ్యాఖ్యలు పదే పదే చేస్తుండటంతో గడలను గూడెం •కెఎ పాల్ అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు రాజకీయ నేతలు. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి సొంత కుంపట్లు పెడుతూ పార్టీ కొంప ముంచుతున్నారని మండి పడుతున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు సరైన నిర్మణం తీసుకోపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్ట వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.