Take a fresh look at your lifestyle.

భారత్‌లో మూడవ దశ ప్రారంభంలో ఉంది

  • కోవిడ్‌ -19 ‌హాస్పిటల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌గిరిధర్‌  ‌గియానీ
    ‘ద క్వింట్‌’ ‌కథనం

కోవిడ్‌ -19 ‌వ్యాధి బయటపడినప్పుడు సామాజిక పరివర్తన చాలా క్లిష్టంగా ఉందని, ఈ దశలో ఏదైనా ఒక అంటు వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుందని రుజువైందని, ఇలాంటి అంటువ్యాధులను అరికట్టడానికి ఐదు నుంచి పది రోజుల వ్యవధి చాలా అవసరమని, అప్పట్లో అనుమానం మాత్రమే కానీ ఇప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని కోవిడ్‌ -19 ‌చికిత్స చేసే దవాఖానాల టాస్క్ ‌ఫోర్స్ ‌కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌గిరిధర్‌ ‌గియానీ చెప్పారు. మార్చి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన హెల్త్ ‌కేర్‌ ‌ప్రొవైడర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కోవిడ్‌ -19 ‌దవాఖానాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేయడానికి తగిన వ్యవధి లేక తాము సతమతమవుతున్నామని, వచ్చే కొద్ది వారాల్లో సిబ్బంది కొరత మరింత తీవ్రం కావచ్చని, సుశిక్షితులైన వైద్య సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. కొరోనా పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ పాత పద్దతులనే పాటిస్తోందని, ఈ పద్దతిలో అత్యవసరంగా మార్పు రావాలని ఆయన తెలిపారు. మూడు లక్షణాలైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

జ్వరం ఉన్నవారికే ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఒక లక్షణం మాత్రమే ఉన్న రోగులకు అసలు పరీక్షలు నిర్వహించడం లేదని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని పరీక్షలూ నిర్వహించే కిట్స్ ‌లేవని ఆయన అన్నారు. ‘ద క్వింట్‌’ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానం చెబుతూ ప్రభుత్వం గట్టి నమ్మకం లేని కేసులపై పరీక్షలు జరిపితే ఉన్న కిట్స్ అయిపోతాయని చెబుతారన్నారు. ప్రభుత్వం వద్ద కోవిడ్‌ ‌పరీక్షలు జరిపే కిట్స్ ‌తగినన్ని లేవని అన్నారు. ‘కరోనా చికిత్సకు సంబంధించి అనుసరించే విధానానికి ప్రభుత్వం పునర్‌ ‌వ్యూహాన్ని రూపొందించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారి విషయంలోనే కాకుండా, జ్వరం తీవ్రత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వారికి తగిన పరీక్షలి నిర్వహించి చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. దేశంలో ప్రస్తుతం అలాంటి పరీక్షలు నిర్వహించే లేబొరేటరీలు 118 వరకూ మాత్రమే ఉన్నయి. రోజుకు 15,000 మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి కాక, 16 ప్రైవేట్‌ ‌లేబ్స్‌లో రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల ప్రకారం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కేవిడ్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల సహకారం కూడా తీసుకుంటున్నారు. వాటి ద్వారా కొంత మేర వైద్య పరికరాల కొరత తీరవచ్చు. అంతేకాక, బాగా శిక్షణ పొందిన వైద్యుల సేవలు లభించవచ్చు. ప్రస్తుతం ఉన్న సమస్య కోవిడ్‌ ‌దవాఖానాలను ఎంపిక చేయడం, తర్వాత శిక్షణ పొందిన నర్సులు, మెడిక్స్ , ‌కో వర్కర్లను ఎంపిక ఓ సవాల్‌. ‌కొన్ని వైద్య కళాశాలల హాస్టళ్ళను ఖాళీ చేయమన్న సూచన వచ్చింది. దానిపై ప్రధాని ఏం ఎందుకు ఖాళీ చేయాలి అని ప్రశ్నించారు. ఫైనలియర్‌ ‌విద్యార్ధులను కాలేజీల్లో ఉంచి వారి సేవలను వినియోగించుకోవచ్చు. వారికి యోగ్యతా పత్రాలు ఇవ్వవచ్చు. కోవిడ్‌ ‌రోగులకు సేవలందించినందుకు సర్టిఫికెట్లు ఇవ్వచ్చు.’ అని గిరిధర్‌ ‌జ్ఞాని అన్నారు. ‘జనవరి 30వ తేదీన సమావేశం జరిగింది. అప్పటి నుంచి పూనుకుని ఉంటే కావల్సినంత సమయం ఉండింది. ఇప్పుడు కోవిడ్‌ ‌మూడో దశలో ఉంది. రోగాన్ని అదుపు చేయడానికి ఇప్పుడు సమయం పడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply