Take a fresh look at your lifestyle.

శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్న ఆలయాలు

శైవక్షేత్రాల్లో శివపార్వతుల కల్యాణ వైభోగం –  ముస్తాబైన దేవాలయాలు

The temples that resonate with Shivanamamరాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ శివరాత్రి పర్వదిన శోభతో వెల్లివిరిస్తున్నాయి.హరహరశంకర, శివశివశంకర వంటి భక్తుల శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. సుప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వర ముక్తేశ్వరం, కురవి, ఏడుపాయల, వేయిస్థంభాలగుడి,రామప్ప మంథని గౌతమేశ్వరాలయం, తదితర క్షేత్రాలన్నింటినీ చక్కగా ముస్తాబు చేశారు. ఫిబ్రవరి మొదటివారంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ప్రారంభిస్తే తెలంగాణలో జాతరల పండుగలు కొనసాగు తున్నాయి.తెలంగాణ తర తమ భేదాలు లేకుండా అందరూ ఉపవసించి జాగరణ చేసి శివుడికి ప్రణమిల్లే గొప్ప ఆధ్యాత్మిక పండుగ శివరాత్రి ఈ పండుగ సందర్భంగా వేములవాడ క్షేత్రంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అనుసంధానమైన మిడ్‌మానేరు సందర్శించేందుకు వీలుగా రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్‌‌ ట్రిప్‌ ‌సౌకర్యం ఏర్పాటు చేసింది. వేములవాడలో మూడురోజుల పాటు బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు..పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.విద్యుద్దీపాల అలంకరణలతో ఆలయాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శివపార్వతీ కళ్యాణానికి హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ప్రపంచవ్యాప్తంగా పేరుగడించడంతో కాళేశ్వరక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది.మార్చి 6 వ తేదీవరకు వేములవాడలో ఉత్సవాలు జరుగనున్నాయని కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి వెల్లడించారు.

The temples that resonate with Shivanamam1

వేములవాడ రాజన్న నామస్మరణతో కోడేమొక్కులతో దేవాలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. భక్తులు పవిత్రస్నానాలు ఆచరించేందుకు కొలనును సిద్ధం చేశారు. వెలువపల స్నానఘట్టాలను అందుబాటులోకి తెచ్చారు. శివసత్తుల పూనకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చత్తీస్‌గఢ్‌, ‌కర్ణాటక,మహారాష్ట్ర సమీప ప్రాంతాల నుండి వచ్చే భక్తుల తాకిడితో వేములవాడ కిటకిటలాడింది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఐఏఎస్‌లు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల మంచినీటి ఎద్దడి ఏర్పడటంతో వేగంగా పనులు పూర్తి చేసి లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం నిరంతర మంచినీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు ఆగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నసంతర్పణకోసం అన్నదాన సత్రాలను కార్పొరేట్‌ ‌సంస్థలు ఏర్పాటు చేశాయి.రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కన్నుల పండువుగా చూసేందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలయాల పునరుద్ధరణలకు ప్రత్కేక చర్యలు తీసుకున్నారు.ఈ నేపథ్యంలలోనే వేములవాడ, కాళేశ్వరం అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.వేములవాడ అభివృద్ధికి డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణాన్ని శైవక్షేత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. కాగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి కళ్యాణం నిర్వహించేందుకు గుడిని శోభాయమానంగా అలంకరించారు.జనగాం జిల్లా లోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహస్వామి క్షేత్రాన్ని శివరాత్రికోసం అలంకరించారు. చుట్టుపక్కల వంద గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా కదిలివస్తున్నారు.వందల సంవత్సరాల తెలంగాణ చరిత్రతో ఈ క్షేత్ర మహాత్య్మం ముడిపడి ఉన్నది. పాలకుర్తి స్వామి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కళ్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

శివరాత్రి పండుగకోసం ఏడుపాయల క్షేత్రాన్ని కన్నుల పండువుగా అలంకరించారు. శివశివశంకర భక్తవశంకర అంటూ శివపంచాక్షరీ జపం మార్మోగుతున్నది.మెదక్‌జిల్లాకే ఆణిముత్యంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.మహాశివరాత్రి మరుసటి రోజు సంప్రదాయం ప్రకారం వంద ఎద్దుల బండ్లు గుమ్మటాల బండ్లను జాతర ప్రాంగణంలో ఊరేగిస్తారు. బండ్ల ఊరేగింపు ఇక్కడి ప్రత్యేకత.మూడోరె•జు రథోత్సవంతో జాతర ముగుస్తుంది.గలగలపారే మంజీర నదీ జలాల్లో పవిత్ర స్నానాలను చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. తాగునీటివసతి ఏర్పాటు చేశారు,.. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడ్బటూర్‌లో సిద్ధేశ్వరస్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు జరిగాయి. వరంగల్‌ ‌పట్టణంలోని వేయి స్థంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతున్నది. రామప్పకు భక్తులు బారులు తీరారు. ఇదేవరుసలో భద్రకాళిని సందర్శించేందుకు భక్తులు కదిలివస్తున్నారు.అన్నీ ఆలయాల్లో ప్రసాదాలకు ఇబ్బందులు కలుగకుండా ఇరవైనాలుగుగంటలపాటు ప్రసాదాల కౌంటర్లు ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే అన్నీ జిల్లాల కలెక్టర్లతో దేవాదాయశాఖ ఫెస్టివల్‌ ఆఫీసర్‌లతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించారు.భక్తులకు ఎటువంటి అసౌకరక్యం కలుగవద్దని ఆదేశాలను ఇచ్చారు.

రెండువేల మంది కళాకారులతో ప్రదర్శనలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ శైవక్షేత్రాలలో భక్తులకు ఆహ్లాదం కలిగించే విధంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ కళాప్రదర్శనలు ఏర్పాటు చేసింది. హరికథలు, బుర్రకథలు, కూచిపూడి నృత్య్కప్రదర్శనలు,.. శివపార్వతీ కళ్యాణాల నృత్యప్రదర్శనలు వంటి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మిమిక్రీ, మైమ్‌ ‌కళాకారులఱు, ఏకపాత్రాభినాయాలు ఉంటాయని రాష్ట్ర సాంస్కృతికశాఖ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply