Take a fresh look at your lifestyle.

గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాకారం

  • స్వాతంత్య్ర పోరాటం..గాంధీకి ముందు..తరవాతగా చూడాలి
  • స్వాతంత్యోద్య్రమాన్ని మలుపు తిప్పిన దండి
  • అద్భుతమైన వ్యూహరచన చేసిన మహాత్ముడు
  • ఈ తరానికి స్వాతంత్య్ర ఉద్యమం గురించి తెలియాలి
  • పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఆజాద్‌కీ అమృత్‌ ఉత్సవ్‌లో సిఎం కెసిఆర్‌

మన స్వాతంత్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కెసిఆర్‌ అన్నారు. మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌లాంటి వారికి గాంధీ ఆదర్శంగా నిలిచారు అని గుర్తు చేశారు. గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి సాకారం చేశామని అన్నారు. ఆనాడు గాంధీజీ అద్భుతమైన ఉద్యమ వ్యూహ రచన చేశారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నా సహచరులతో గాంధీజీ వ్యూహ రచననే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాను. అహింసాయుతంగా … గాంధీ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అద్భుత పోరాటంగా పరిణమించిందని కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్య ్రభారత్‌ 75‌వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. స్వతంత్ర చరిత్రను మహాత్ముని ముందు… తర్వాతగా చూడాలి. ఆయనకంటే ముందు కూడా స్వతంత్య్ర చరిత్ర ఉంది. కానీ ఆయన తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి. చాలా సందర్భాల్లో సంశయాలు ఉండేవి. చాలా మందిలో అనుమానాలు నెలకొన్నాయి. అహింశాయుతమైన పంథాలో ప్రజలు ఉద్యమించాలన్నదే ఆయన అభిలాష. కొంతమంది ఉద్రేకపరులను నిరాశపరిచింది.

గాంధీజీ చేపట్టిన అహింసాయుత మార్గంలోనే దేశానికి స్వాతంత్య్ర వచ్చింది. మానవహక్కుల నేత మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌జూనియర్‌కు స్ఫూర్తి ఆయన. 1930 ప్రాంతంలో మార్చ్ 12‌న దండి అనే గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. దండి మార్చ్ ‌స్ఫూర్తితోనే అమృతోత్సవాలను ప్రారంభించాలని ప్రధాని భావించారు. అందుకే ఈ రోజున ప్రారంభించారు. స్వాతంత్య ్రఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీజీ ఉద్యమంలో చేరిన తరవాతనే స్వాతంత్య ్రఉద్యమం ఉధృతంగా సాగిందన్నారు. బ్రిటీష్‌ ‌వారు తెచ్చిన ఉప్పు చట్టం దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిందని గాంధీ గ్రహించారు. దీంతో గాంధీ 1930, మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండి వరకు గాంధీ పాదయాత్ర చేశారు. ఉప్పు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -

దండి యాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. అరేబియా సముద్రం తీరాన పిడికెడు ఉప్పు చేతబట్టి.. మహాత్మాగాంధీ సింహంలా గర్జించారు. గాంధీ చేపట్టిన దండి యాత్రలో హైదరాబాద్‌ ‌ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. దండి యాత్ర స్వాతంత్య సంగ్రామంలో అద్భుత ఘట్టమని సీఎం అన్నారు. స్వాతంత్య ్రఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అహింసా పద్ధతిలో శాంతియుతంగా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. ఆపద్ధతిలోనే శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో 75 వారాల పాటు అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సలహా దారుగా కొనసాగుతున్న రమణాచారి ఈ కమిటీ అధ్యక్షులుగా నియమించుకుని ముందుకు కొనసాగుతున్నా మని తెలిపారు. ఈ వేడుకల కోసం రూ.25కోట్లు కేటాయించామని చెప్పారు. నవీనతరం వారికి స్వాతంత్య ్రపోరాటాన్ని తెలియజేసేందుకు రమణాచారి ఆధ్వర్యంలో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుందన్నారు.

public garden

అన్ని విద్యాసంస్థల్లో వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రచయితలు, కవులతో కవి సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలు ఉంటాయ న్నారు. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలను వరంగల్‌లో ప్రారంభించిన గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌కు సీఎం కేసీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికా రులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు వి•డియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. అంతకుముందు కెవి రమణాచారి స్వాగతోపన్యాసం చేస్తూ..ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందిం చారు. సిఎం కెసిఆర్‌ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ తరానికి నాటి ఉద్యమస్ఫూర్తిని చాటాలన్నదే లక్ష్యమని అన్నారు. ఈ వేడుకలకు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధి కారులుహాజరయ్యారు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌ ‌వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు.

Leave a Reply