Take a fresh look at your lifestyle.

మోడీ ప్రభుత్వం మీద దేశద్రోహం కేసు పెట్టాలి

  • కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా రాజీనామా చేయాలి
  • పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌సాఫ్ట్ ‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించింది ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి

ప్రధాని మోడీ ప్రభుత్వం మీద దేశద్రోహం కేసు పెట్టాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేసారు. ‘ఇజ్రాయిల్‌ ‌ప్రభుత్వం పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌భద్రత దళాల ఉపయోగం కోసం తయారు చేసి వివిధ దేశాల ప్రభుత్వాలకు అమ్ముతుంది..అటువంటి దాన్ని కొని మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద, జర్నలిస్ట్‌ల, మీద సుప్రీమ్‌ ‌కోర్టు జడ్జిల మీద సమాజంలోని ఇతర మేధావుల మీద ప్రయోగించింది. అంటే దేశ ద్రోహానికి పాల్పడింది. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ అతని అనుచరులపై పెగాసస్‌ ‌స్పైవేర్‌ను వాడటం అప్రజాస్వామికం’ అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో దేశం గురించి ఆలోచించే వారిపై ప్రభుత్వం నిఘా వేయడం అంటే ప్రభుత్వమే దేశ ద్రోహానికి తలపెట్టడం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నిచారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వంపై రేవంత్‌ ‌రెడ్డి విరుచుకుపడ్డారు. 2019 లోనే వాట్సాప్‌ ‌సంస్థ పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌సాఫ్ట్ ‌వేర్‌ ‌గురించి ప్రభుత్వానికి తెలిపింది. దీని ద్వారా మీ దేశంలో గూఢచర్యం జరుగుతున్నది మీకు తెలుసా అని మోడీ ప్రభుత్వాన్ని అప్పుడు వాట్సాప్‌ అడిగింది.

అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈ రోజు మన ముందు వుంది. ఈ సమస్యపై వాట్సాప్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు కూడా గతంలో పార్లమెంట్‌లో చర్చ జరిగింది. అప్పుడు స్వయంగా అప్పటి మంత్రి ఇ రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌స్వయంగా ఒప్పుకున్నారు. ఈ సమస్య ఉందని ఆయనే స్వయంగా వెల్లడించారు. పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌సాఫ్ట్ ‌వేర్‌ ‌వలన భారత దేశంలో 121 మంది ఫోన్‌లు స్నూపింగ్‌కి గురయ్యాయని పార్లమెంట్‌ ‌వేదికగా చెప్పారు. అప్పుడున్న మంత్రి అలా చెబితే ఇప్పుడున్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌రా…? అదేంటి…? అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కాదు దొంగ వైఖరి అనుసరిస్తున్నది. తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎంత నీచానికైనా దిగుతున్నదని రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా దిగజారిపోయి ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్‌ ‌చేస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

ఇది దుర్మార్గం కాదు దేశద్రోహం అని రేవంత్‌ ‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, అలాగే పార్లమెంట్‌ ‌జేపీసీ వేయాలని సుప్రీమ్‌ ‌కోర్టు జడ్జి పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ చేపట్టాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలా ఉంటే కెసిఆర్‌ ‌నేను తక్కువ తిన్నానా అని వ్యవహరిస్తున్నది కెసిఆర్‌ ‌ప్రభుత్వం. కేంద్రం కన్నా భిన్నంగా ఏమీ లేదు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం గతంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు టాప్‌ ‌చేసి తెలంగాణ ఎంపీల ఫోన్లు ట్యాప్‌ ‌చేసి గూఢచర్యానికి పాల్పడింది. ఆ కేసు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో నడుస్తుంది. కేంద్రం…కేసీఆర్‌ ‌రెండు ఒకే వైఖరి అనుసరిస్తున్నాయి.18 వ తారీఖున జాతీయ మీడియా పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌గురించి కథనాలు రాసింది.. నేను 16 వ తారీఖున చెప్పాను. కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఐజి ఇంటెలిజెన్స్ ‌ప్రభాకర్‌ ‌రావు నేతృత్వంలో పెగాసస్‌ ‌స్పైవేర్‌ను కొని 50 మంది హ్యాకర్లను పెట్టి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎం‌పీలను తెలంగాణలో ఉన్న మీడియా సంస్థల యజమానులు ప్రతినిధుల నంబర్లను స్నూపింగ్‌లో పెట్టింది. అది మీడియాలో కూడా వచ్చింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. ప్రజా హక్కుల కోసం కొట్లాడుతున్న వారి ఫోన్‌ ‌నెంబర్లను టాప్‌ ‌చేసి వారిని టార్గెట్‌ ‌చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నది.

ఈ సమస్యపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఏఐసీసీ దిశా నిర్ధేశం చేసింది. అలాగే ఈనెల 22వ తారీఖున ప్రతి రాష్ట్రంలో చలో రాజ్‌ ‌భవన్‌ ‌కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసిసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడడానికి వొచ్చాను. అలాగే పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాను. 22వ తారీఖున జరగనున్న చలో రాజ్‌ ‌భవన్‌ ‌కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని..అని రేవంత్‌ ‌రెడ్డి మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం మీద, కేసీఆర్‌ ‌ప్రభుత్వం మీద దేశద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్‌ ‌చేస్తున్నామని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాల్సిందే అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణాలో పోలీస్‌ ‌మోడ్రనైజషన్‌ ‌కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేసింది స్నూపింగ్‌ ‌కోసం. ఇది పార్లమెంటులో లేవనెత్తుతామని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు..కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రిగా స్వయంగా కిషన్‌ ‌రెడ్డి చెప్పారు కెసిఆర్‌ ‌తమ ఫోన్‌ ‌టాప్‌ ‌చేసారని మీడియాకి చెప్పారు. అయినా కేంద్రం ఎందుకు ఛార్జ్ ‌తీసుకోలేదు ఎందుకని అడుగుతూ ఈ రోజు కిషన్‌ ‌రెడ్డి చెప్పాలి. ఈ రోజు కూడా కెసిఆర్‌ ‌ఫోన్‌ ‌టాపింగ్‌ ‌చేసారన్నారు. ఈ విషయం మీద ఇప్పటికి నిలబడతారా అని రేవంత్‌ ‌రెడ్డి అడిగారు.

Leave a Reply