- తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్, పక్కనే బీజేపీ
- బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్ దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని, ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష కనుబరుస్తున్నారనీ, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ టీఆర్‌ఎస్ నేతలు హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ దీక్షకు పబ్లిసిటీ రావాలన్న ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు సైతం సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ భవన్‌లో సమీపంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ధాన్యం కొనుగోలు చేయలేని చేతగాని సీఎం కేసీఆర్ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ విషయాన్ని గమనించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. కాగా, బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన బీజేపీ దీక్ష సందర్బంగా సభాస్థలి పరిసరాల్లో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేతగాని సీఎం కేసీఆర్ అంటూ వడ్లు కొనుగోలు చేయలేక రైతులను మోసం చేస్తూ ఆ నెపాన్ని బీజేపీ మీదికి నెడుతున్నారని అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, దిల్లీలో కేసీఆర్ దీక్ష, హైదరాబాద్‌లో బీజేపీ దీక్ష సందర్భంగా పరస్పరం ఇరు పార్టీల నేతలు ఒకరి ఫ్లెక్సీలను మరొక పార్టీ నేతలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది.