Take a fresh look at your lifestyle.

బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ‌దారుణం

  • వారిని సభలోకి అనుమతించాలి
  • టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 8 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ ‌వెనక్కి తీసుకుని సభలోకి అనుమతించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజాస్వామ్యం లో ఇలాంటి నిరంకుశ విధానాలు సరికాదన్నారు. కావాలనే వారిని సస్పెండ్‌ ‌చేసినట్లుగానే ఉందన్నారు. ఇకపోతే తెలంగాణలో బడ్జెట్‌కు, ఖర్చుకు20శాతం తారతమ్యం ఉంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి.

అంచనాలు తప్పుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఆత్మహత్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నిరుద్యోగభృతి ఏమైందని ప్రశ్నించారు. విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలు కల్పన లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply