Take a fresh look at your lifestyle.

నేడు ‘ప్రపంచ అటవీ దినోత్సవం’ అడవులతోనే మానవాళి మనుగడ

“వైల్డ్ ‌లైఫ్‌ ‌యాక్ట్ ‌ప్రకారం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ప్రస్తుతం 20 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి జీవుల మనుగడకు, పర్యావరణ సమతు ల్యతకు సవాలుగా మారుతోంది. నేడు పట్టణీకరణ, వ్యవసాయం, ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహ వినియోగం వంటి కారణాలతో అడవులు అంతరించి పోతున్నాయి. గ్లోబల్‌ ‌వార్మింగ్‌తో భూగోళం వేడెక్కుతోంది. వర్షపాతాలు పడిపోతున్నాయి.”

nerupati anandhసమస్త జీవులు భూమి మీద మనుగడ సాగించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడవులే కారణం. అడవులలో రకరకాల మొక్కలు, చెట్లు, జంతువులు బ్రతికేందుకు అలవాటు పడి ఉన్నాయి. మనదేశంలో భూభాగంలో 20 శాతం అడవులు ఉన్నాయి. ప్రకృతి సమతుల్యత కాపాడటానికి వానలు సమయానికి భూమి మీదకు రావాలన్నా, భూమి వేడి తగ్గాలన్నా, జంతువులు, వృక్షాలు బతకాలన్నా భూమి మీద 33 శాతం ఆకు పచ్చని చెట్లు ఉండాలి. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2012 నవంబర్‌ 28‌న చేసిన తీర్మానం అనుసారం 2013 నుండి ప్రతి సంవత్సరం మార్చి 21న ‘ప్రపంచ అటవీ దినోత్సవం’’ నిర్వహించబడుతున్నది. నేటితరం మరియు రాబోయే తరాల వారికి అడవుల ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం వారికి అవగాహన కల్పించడం కోసం అడవుల రక్షణ, పరిరక్షణ, విస్తరణ, మొక్కలు నాటడం, చెట్ల పెంపకం, తదితర అంశాలపై విస్తృతంగా చర్చ, ప్రచారం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెల్పడం ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతిరోజు కొన్ని వేల చెట్లు నరకబడుతునాయి. ఇప్పటికీ ప్రజలలో మొక్కల, అడవుల ఉపయోగం గురించి సరైన అవగాహన లేదు.

వైల్డ్ ‌లైఫ్‌ ‌యాక్ట్ ‌ప్రకారం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ప్రస్తుతం 20 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు సవాలుగా మారుతోంది. నేడు పట్టణీకరణ, వ్యవసాయం, ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహ వినియోగం వంటి కారణాలతో అడవులు అంతరించిపోతున్నాయి. గ్లోబల్‌ ‌వార్మింగ్‌తో భూగోళం వేడెక్కుతోంది. వర్షపాతాలు పడిపోతున్నాయి. ఆగ్రో, అర్బన్‌ ‌ఫారెస్ట్‌లు వంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టినా పూర్తిగా కార్యరూపం దాల్చడం లేదు.ప్రపంచ జనాభాలో 17 శాతం మన దేశంలోనే ఉన్నది. ప్రపంచంలో అటవీ శాతం 11 మాత్రమే ఉన్నది. గిరిజనులకు, సాంప్రదాయ అటవీ వాసులకు ప్రయోజనకరంగా అటవీ హక్కుల చట్టాన్ని 2006లో చేసినా దాని అమలు మందగించింది. తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణం 1,12,196.41 చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం 26,903.71 చదరపు కిలోమీటర్లు.

- Advertisement -

అడవుల శాతం 23.98 శాతం. అందువలన ఇంకా హరిత హారం ద్వారా చాలా మొక్కలను నాటాల్సిన అత్యవసరం చాలా ఉన్నది. ఈ మధ్య కాలంలో అభివృద్ధి పేరిట పెద్ద పెద్ద వృక్షాలను రాష్ట్రంలో నరికివేయడం జరిగింది. దీని వలన తెలంగాణాలో అటవీ విస్తీర్ణం మొక్కల సంఖ్య తగ్గింది. అయితే ప్రస్తుతం అంతరించిపోతున్న అడవులు జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఒకవైపు అక్రమార్కుల చేతిలో పడి అడవులు నాశనం అవుతున్నాయి. మరోవైపు మానవ తప్పిదాలు అడవులను దహించి వేస్తున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలకు వృక్షసంపద ఆహుతి అవుతోంది. అడవిలో ఉద్దేశ్యపూర్వకంగా అగ్గి పెడితే ప్రజా ఆస్తులకు నష్టం(నివారణ) చట్టం 1984 కింద ఒక సంవత్సరం నుండి పది సంవత్సరముల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. ప్రమాద వశాత్తు, లేదా సంఘ విద్రోహ కార్యక్రమాల వలన అడవులు అంటుకున్నప్పుడు ఫైర్‌ ‌లైన్‌, ‌పచ్చి కొమ్మలతో మంటలు ఆర్పడం, బ్లోయర్‌తో మంటలు ఆర్పడం వంటి పద్ధతులు పాటించవచ్చు. అడవులను గుట్టలను అభివృద్ధి పేరు తో నాశనం చేయడం వలన అడవులు మరియ గుట్టలను ఆవాసాలు చేసుకొని ఉన్న జంతువులు కూడు గూడు లేక జనావాసాలలోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం, ఆస్తి నష్టం పంట నష్టం చేయడము లాంటివి జరిగి చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి. అందువలన అటవీ జంతువులు తినే పండ్ల మొక్కలను ఎక్కువగా నాటడం వలన జంతువులు జనావాసాల్లోకి రాకుండా కట్టడి చేయవచ్చు.

ఒక ఏడాదిలో ఒక చెట్టు 12 కిలోగ్రాముల కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ ‌ను తీసుకొని నలుగురు సభ్యులు గల కుటుంబానికి సరిపడా ఆక్సిజన్‌ అం‌దిస్తుంది. తన 55 ఏళ్ల జీవితకాలంలో ఒక చెట్టు 5.3 లక్షల విలువైన ఆక్సిజన్‌ ‌ను, 6.4 లక్షల విలువైన మట్టిని క్రమక్షయం కాకుండా కాపాడుతుంది. 10.50 లక్షల విలువైన చల్లదనాన్ని ఇస్తుంది.స్థానిక గిరిజనులు ఇతర అటవీ వాసుల వల్లనే అడవులు రక్షించబడుతున్నాయి తరతరాలుగా వారికి నీడనిచ్చి జీవనోపాధి కల్పిస్తున్న అడవులను ఆదివాసులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అడవులను నాశనం చేసేది వృక్ష సంపదను దొంగిలించేది సంఘ విద్రోహ శక్తులే. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. అటవీ హక్కుల చట్టం పూర్తిస్థాయి అమలుకు అవసరమైన అన్ని రాష్ట్రాల్లోనూ దీర్ఘకాలిక ఉద్యమాలను చేపట్టాలి.33 శాతం అడవులను చేరుకోవాలి. ఉన్న అడవుల సంరక్షణ పునరుజ్జీవనము. అటవీ భూముల బయట చెట్లు నాటడం వంటి పద్ధతులు పాటించాలి. అందుకే మనం మొక్కలు నాటి పెంచి రక్షించాలి. మన దగ్గర్లో ఖాళీ స్థలంలో పంట పొలాల గట్ల మీద చెట్లు, సామాజిక అడవులను పెంచుకోవచ్చు. అప్పుడు మన చుట్టూ రకరకాల పక్షులు పిట్టలను మనం చూడగలుగుతాం. మొక్కలను కాపాడితే అవి నేలను వర్షానికి కొట్టుకు పోకుండా కాపాడుతాయి, దాంతో సరైన సమయంలో వర్షాలు భూమిమీదికి వొస్తాయి.ప్రజలకు అడవుల వల్ల కలిగే ఉపయోగాలపై ప్రభుత్వం విస్తృతంగా అవగాహన పెంచాలి.

Leave a Reply