కరోనా వ్యాధి విస్తరిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో సుప్రీమ్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గేవరకు ముఖ్యమైన కేసులను మాత్రమే విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టుకు వొచ్చే ప్రజలు, సిబ్బంది, జడ్జిల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కోర్టు విధులకు కొంత పరిమితి విధించినట్టు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈమేరకు సుప్రీమ్ కోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్.కల్గాంకర్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.