Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌చెప్పిందే సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌చెప్పింది: విహెచ్‌

Hanumantha Rao V Telangana

దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లకు 34 మంది చనిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ వి .హనుమంతరావు అన్నారు. గురువారం గాంధీభవన్‌ ‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ …సి ఏ ఏ వల్లనే ఇదంతా జరుగుతుందని తమను దేశంలో నుంచి బయటకు పంపుతారనే భయంతో మైనారిటీ ప్రజలు బతుకు తున్నారని తెలిపారు.శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారి పైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.దడులకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టులు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేసిన ప్రకటన మద్దతు ఇస్తున్నమని బీజేపీ నాయకులు రెచ్చగొట్టి హింసకు ప్రేరిపిస్తున్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పిందే సుప్రీం కోర్ట్ ‌చెప్పిందని గుర్తు చేశారు. మోడీ వెంటనే ఈ విషయాలపై చర్యలు తీసుకొని సీఏఏ ను రద్దు చేసుకోవాలని సూచించారు .ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ ‌విషయంలో స్పష్టమైన వ్యాకరి ప్రకటించాలని కోరారు.

Leave a Reply