Take a fresh look at your lifestyle.

రైతుల పోరాటం వెలకట్టలేని త్యాగం.. వర్ణించలేని విజయం..

మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై అవిశ్రాంతంగా పోరాడి విజయం సాధించిన రైతులకు, వారికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చాకు తెలంగాణ విద్యావంతుల వేదిక అభినంధనలు తెలియజేస్తుంది. శాంతియుత  దీర్ఘకాల ఉద్యమాలతో  విజయం సాధించ వచ్చని దిక్సూచి గా నిలిచి నిరూపించిన   రైతు ఉద్యమం  త్యాగం వ్యక్తీకరించలేనంతది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం నుండి తప్పుకోవడానికి దేశంలోని కార్పోరేట్, సామ్రాజ్యవాద శక్తులకు గంప గుత్త గా అప్పగించడానికి బిజెపి,ఆర్ యస్ యస్  కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2020లో  చేసిన మూడు వ్యవసాయ చట్టాల రూపకల్పన  కు వ్యతిరేకంగా రాజకీయాలతో సంబంధం లేకుండా  రైతాంగం చేసిన పోరాటం వెలకట్టలేనిది. నల్ల చట్టాల రద్దు ను డిమాండ్ చేస్తూ  దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు,పౌర సమాజం ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు డిల్లీ సరిహద్దుల్లో అపూర్వ చారిత్రక ఉద్యమం ను సంవత్సర కాలంగా సాగిస్తూవచ్చారు. మోడీ కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలకు, వారి  పోలీసు దాడులకు, చివరకు కేంద్ర మంత్రి  తమ వాహనాలతో  రైతులను తొక్కి చంపి నేడు ఏమి ఎరగనట్లు క్షమాపణలు కోరడం దుర్మార్గం.. మొక్కవోని పట్టుదలతో రైతులు ముందుకు సాగిన తీరు ప్రపంచ రైతాంగానికే ఆదర్శం .డిల్లీ సరిహద్దుల్లో  శాంతియుతంగా రోడ్లపై బైఠాయించిన రైతులలో 650 కు పైగా రైతులు చలి, వానలు,ఎండలకు ప్రాణాలు కోల్పాయారు. వారి త్యాగం చరిత్ర లో సువర్ణా అక్షరాలతో లిఖించదగినది .
రైతు ఉద్యమం…అనివార్యంగా బిజెపి కార్పొరేట్ ల వ్యతిరేక రాజకీయ స్వభావం సంతరించుకుంది .. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, దేశంలో లో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి రైతు ఉద్యమం ప్రధాన కారణం అని తేటతెల్లమయింది. ఈ విషయం ను సంఘ్ పరివార్ కేంద్ర కార్యాలయం గ్రహించింది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల లో ఓడిపోతామనే భయం బాజాపా కు పట్టుకునే వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నిర్ణయం తీసుకుంది.  డిల్లీ పీఠంనే కోల్పోతామనే భయం బిజెపి కి పట్టుకుంది. వ్యవసాయ చట్టాల రద్దు అనేది అదానీ అంబానీల ఓటమి అనడం లో ఎటువంటి సందేహం లేదు.
 పార్లమెంట్ లో  చట్టాలు రద్దు అయ్యేంతవరకు,కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చేంతవరకు తమ ఉద్యమం ఆగదని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చేసిన ప్రకటనను అబినందించదగ విషయం.
అఖిల భారత సంయుక్త కిసాన్ సంఘర్ష సమితి లో విద్యావంతుల వేదిక భాగస్వామి అయి తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ను మరియు డీల్లీ లో కొన్ని ప్రాంతాల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి రైతు సంఘాల ఆందోళన కార్యక్రమాలలో ప్రజాస్వామిక సంస్థలు ,పౌర సమాజం,వామపక్ష రాజకీయ పార్టీ లతో పాటు తెలంగాణ విద్యావంతుల వేదిక కూడ పాల్గొని..డిల్లీ సరిహద్దుల్లోని రైతు శిబిరాలకు వెళ్ళి టివివి సంఘీభావం ప్రకటించింది.పార్లమెంట్ కు సమాంతరంగా  జంత మంతర్ లో నిర్వహించిన కిసాన్ పార్లమెంట్ లో కూడ టివివి పాల్గొన్నది . డిల్లీ రైతాంగ పోరాట స్పూర్తి ని తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తుంది .ఈ విజయం సాధించడంలో రైతు ఉద్యమంలో భాగమైనందుకు  విద్యావంతుల వేదిక గర్వపడుతుంది.
ఉద్యమాభివందనాలతో
అంబటి నాగయ్య
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
+919966989579

Leave a Reply