Take a fresh look at your lifestyle.

ఉక్కు బంద్‌ సంపూర్ణం ..!

  • ఎక్కడిక్కడ నిలచిపోయిన రవాణా
  • మూతపడ్డ విద్యా,వ్యాపార రంగాలు
  • బంద్‌కు అన్ని వర్గాల మద్దతుతో సంపూర్ణం

‌విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదిలాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్‌కు ఇచ్చిన పిలుపు మేరకు తెల్లవారు జాము నుంచే రాష్ట్రంలో బంద్‌ ‌ప్రారంభం అయ్యింది. ఉదయం నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. రాష్ట్రంలోని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. ప్రజారవాణా స్థంబించిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ఇచ్చాయి.రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోయింది. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిన్న చిన్న ఘటనలు మినహా బంద్‌ ‌విజయవంతం అయ్యింది. ప్రధానంగా అన్నివర్గాలు బంద్‌కు సహకరించడంతో ప్రభావం కనిపించింది. బంద్‌ ‌పిలుపులో భాగంగా విశాఖ మద్దిలపాలెం బస్టాండ్‌ ‌వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి.

రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో వైఎస్సార్‌ ‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, ‌కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఎ•-లాంట్‌ ఏ-‌షిప్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్‌ ‌వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు. మద్దిలపాలెం బస్‌ ‌స్టాండ్‌ ‌వద్ద బస్సులు నిలిపివేశారు. నిరసనలో ప్రజాసంఘాల జేఏసీ, సీఐటీయూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ ‌నరసింగరావు పాల్గొన్నారు. స్టీల్‌ ఎ•-‌లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. విశాఖ స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌పరిరక్షణ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్సార్‌ ‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన పది రోజులకు.. చంద్రబాబు స్పందించి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటేనే డ్రామాల పార్టీ అని, ఆయన కుమారుడు పప్పునాయుడని ఆయన విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపును ఇవ్వడంతో కాకినాడలో బంద్‌ ‌ప్రభావం కనిపించింది. అధికార పార్టీ వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కి సంఘీభావం తెలిపాయి.

జెఎన్‌టీయూలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసారు. కాకినాడ సీపోర్ట్ ‌లో కార్మికులు బంద్‌ ‌ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, ‌బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్ ‌మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ట్రావెల్స్, ఆటో డ్రైవర్‌ ‌లు కూడా బంద్‌ ‌పాటిస్తుండటంతో జన సంచారం నిలిచిపోయింది. స్టీల్‌ఎ•-‌లాంట్‌ ‌ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్‌ ‌కొనసాగింది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్‌ ‌నెహ్రూ బస్టాండ్‌ ‌వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితయ్యాయి. రవాణా స్తంభించింది. స్వచ్ఛందంగా దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు సంఘీభావం తెలిపాయి. అనంతపురం నగరంలో వామపక్షాల భారీ ర్యాలీ నిర్వహించాయి. విశాఖ ఉక్కును ప్రవేటీకరించొద్దని డిమాండ్‌ ‌చేశాయి. బంద్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి కమ్యూనిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply