Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేంద్రంలో మోదీతో చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎంఐఎంకు జంకుతు పాలన సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సోమవారం హన్మకొండలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మోదీ, అమిత్‌షా అబద్దాలాడుతున్నారని రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ ‌ప్రకారం దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు.

లౌకిక దేశమని రాజ్యాంగం చెబుతున్న కేంద్రంలో బిజెపి మత విద్వేశాలను రెచ్చగొడుతుందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం మత చిచ్చుకే పనికి వస్తుందన్నారు. పార్లమెంట్‌లో చట్ట సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసిన టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్రంలో డ్రామా చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను అమలు చేయమని ఇప్పటికే 13మంది సిఎంలు ప్రకటించారని బిజెపికి మిత్రపక్షంగా ఉన్న బిహార్‌, ఒరిస్సాలాంటి రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారని పోలీసులను ఆందోళనకారులపై ప్రయోగించడం వల్ల సమస్య ఉద్రిక్తంగా మారిందన్నారు. సిఎఎపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్రంలో ఆర్థికమాంద్యం తీవ్రంగా ఉందని చేసిన పనులకే రూ. 27వేల కోట్లు చెల్లించాల్సి ఉందని మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను 3లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మిగిల్చారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయమని స్పష్టం చేస్తూ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మున్సిపాల్టీల్లో రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడాన్ని తప్పు పడుతూ టిఆర్‌ఎస్‌కు ఎన్నికల సంఘం తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. జనవరి 8న దేశవ్యాప్త సమ్మె ఉండగా అదేరోజున నామినేషన్ల గడువుకు సమయం ఇచ్చారని జనవరి 14, 15 తేదీల్లో పండుగ ఉన్నప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ, అదేతేదీల్లో పెట్టడాన్ని విమర్శించారు. 8న పారిశ్రామిక గ్రామీణ బంద్‌కు ప్రజలందరూ మద్దతిచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.సాయిబాబు, జిల్లా ఇంచార్జి కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: the state’s financial, position, released, ts cm kcr, thammineni verabhadram

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply