Take a fresh look at your lifestyle.

రాష్ట్రాలది కరెంట్‌ ‌షాకులు కేంద్రానిది పెట్రో బాదుడు

ఓవైపు.. కరోనా వైరస్‌ ‌విజృంభనతో ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ పెట్రో ధరలతో సామాన్యులపై కేంద్రం దాడి చేస్తోంది. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాలు దోపిడీ ఆపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ ‌బిల్లులతో ప్రజల నడ్డివిరిస్తే, పెట్రోలు, డీజిల్‌ ‌ధరలను అంతకంతకూ పెంచుతూ… సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దాదాపు 3 నెలల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షలు తొలగించినా… చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్‌ ‌ధర పెరుగుతోంది.  వరుసగా 16వ రోజు కూడా పెట్రోల ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. లీటర్‌ ‌పెట్రోల్‌పై 33పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ ‌పెట్రోల్‌పై రూ.8.36గు పెరగగా… లీటర్‌ ‌డీజిల్‌పై రూ. 8.85 వడ్డించాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఒక్కటే కావడం దారుణానికి పరాకాష్టగా చూడాలి. దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్‌ ‌వినియోగదారులపై చమురు కంపెనీలు దయతలిచాయి. రోజువారీ సక్షలో భాగంగా డీజిల్‌ ‌ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

లీటర్‌ ‌డీజిల్‌పై 48 పెంచగా, పెట్రోల్‌ ‌ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో మొదటిసారిగా పెట్రోల్‌ ‌కంటే డీజిల్‌ ‌ధర అధికమయ్యింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.79.88కి చేరగా, పెట్రోల్‌ ‌ధర రూ.79.76గా ఉంది. దీంతో గత 18 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు రూ.8.50, రూ.10.48 చొప్పున పెరిగాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012, జూన్‌ 18‌న దేశంలో పెట్రోల్‌ ‌ధర లీటర్‌కు రూ.71.16, డీజిల్‌ ‌ధర రూ.40.91గా ఉన్నది. ప్రస్తుతంతో పోల్చితే లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.8 పెరగగా, డీజిల్‌ ‌ధర 39.15 పైసలు పెరిగింది. గత మార్చి 14న ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌పై ఎక్సైజ్‌ ‌సుంకాన్ని లీటర్‌కు రూ.3 విధించగా, మే 5న పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఈ రెండు పెంపులతో ప్రభుత్వానికి అదనంగా రూ.2 లక్షల కోట్లు వచ్చాయి.

Leave a Reply