Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌వల్ల రాష్ట్రం సర్వ నాశనమైంది

  • కాళేశ్వరంతో ఎకరా కూడా నీరు పారలేదు
  • తండ్రీకొడుకులకు అహంకారం తలకెక్కిందన్న భట్టి, జీవన్‌ ‌రెడ్డి

‌మంత్రి కేటీఆర్‌ ఒక పిల్ల కాకి అని.. అరుచుకుంటూ పోవడం తప్ప ఆ కాకితో ఏమి కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల కాళ్లు కడిగి కేటీఆర్‌ ‌నెత్తిన పోసుకున్నా రుణం తీరదన్నారు. త్వరలో సన్నాసులు ఎవరో, దద్దమ్మలు ఎవరో తెలుస్తుందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం పెరిగిందన్నారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌వల్ల రాష్ట్రం నాశనమైందని భట్టి పేర్కొన్నారు. బీజేపీ తీసుకవచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలుద్దాం.. ఆ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేద్దాం.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బూటకం.. ఆ ప్రాజెక్టుతో ఒక్క ఎకరా కూడా పారలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న మోసాలపై అసెంబ్లీలో వి• గొంతుకగా నిలదీస్తాం..’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది.

ఈ సందర్భంగా రైతులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ తీసు కవచ్చిన ఆ మూడు నల్ల చట్టాలతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్నారు.. లక్షలాది మంది రైతులు చలిని లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దులో మనందరి కోసం పోరు సాగిస్తున్నారు.. దేశ రైతు ప్రయోజనాల కోసం వాళ్లు పోరాడుతున్నారో మనం కూడా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మేం ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం అత్యంత ఆందోళనకరమన్నారు. గొప్పలు చెబుతున్న రైతుబంధుతో ఒరగూరేదేమి లేదన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వడ్డీ లేని రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పంట నష్టపరిహారం, డ్రిప్‌, ‌స్పింక్లర్లు, పాలిహౌస్‌లు, వ్యవసాయ పనిముట్లు వంటి పథకాలను బంద్‌ ‌చేసి రైతుబంధు పేరిట కొద్ది డబ్బులు మాత్రమే ఇస్తూ కేసీఆర్‌ ‌రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.

- Advertisement -

ఎస్సారెస్పీ ద్వారానే లక్షా 50వేల ఎకరాలకు ఈ ప్రాంతానికి నేటికి సాగు నీరు అందుతున్నాయని, టీఆర్‌ఎస్‌ ‌వచ్చిన తర్వాత ఒక్క ఎకరం కూడా అదనంగా పారలేదన్నారు. తమ హయాంలో నాగార్జునసాగర్‌, శ్రీ‌రాంసా గర్‌, శ్రీ‌పాద ఎల్లంపల్లి, మిడ్‌ ‌మానేరు, నె•-టటెంపాడు, జూరాల, కోయిల్‌ ‌సాగర్‌, ఇం‌దిరా సాగర్‌, ‌రాజీవ్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టులను 65 వేల కోట్లను ఖర్చు చేస్తే, టీఆర్‌ఎస్‌ ‌వచ్చిన తర్వాత కాళేశ్వరం, డిండి పాలమూరు చేపట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు. ఏడేళ్లలో మూడున్నర లక్ష ల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఇంకా లక్షన్నర కోట్ల అప్పు చేస్తా మని చెబుతున్నాడని అన్నారు. ఇప్పుడు పారుతున్న నీళ్లన్నీ కాళేశ్వరం నీళ్లు కాదని, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్‌ ‌బెడ్‌ ‌రూముల ఇళ్లు, కేజీ టూ పీజీ, తదితర పథకాల పేరు చెప్పి ఓట్లు దండుకున్న కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని, అప్పులు పెరిగిపోయాయని, ఉద్యోగాలు లేవని, ఎక్కడ చూసినా అక్రమాలు, అన్యాయాలు, ఆరాచకాలే కనబడుతున్నాయన్నారు.

అసెంబ్లీలో వి• గొంతుకనై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, నల్ల చట్టాలను రద్దు చేసే వరకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేవరకు పోరాటం చేస్తామని మల్లు భట్టి విక్ర మార్క రైతులకు భరోసా కల్పించారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ ఇద్దరు దొందు దొందేనని, తోడు దొంగలని వారి మాటలను నమ్మ వద్దని అన్నారు. కుక్కలకు విశ్వాసం ఉంది.. సీఎం కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఆర్‌కు సీఎం పదవి చెప్పుతో సమానమైతే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ అహంకారం తగ్గించుకోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితువు పలికారు. కేసీఆర్‌ను పదవి నుంచి దింపే దాకా మంత్రి కేటీఆర్‌ ‌వదలడని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

సీఎం పదవి నా చెప్పుతో సమానం అంటూ కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.. సీఎం పదవి నీ చెప్పుతో సమానం అయితే, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో తెలంగాణలో ఒక్కరూ సంతోషంగా లేరని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్‌ ‌కూడా కుక్కనే అన్నారు. కేసీఆర్‌కు అసహనం పెరిగిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్‌కు కూడా అహంకారం పెరిగిందని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే ఇదే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఎక్కడ ఉండేవారని పొన్నం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌హయాంలో తెలంగాణ పరిస్థితి ఆగమ్యచారంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply