Take a fresh look at your lifestyle.

కొరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది: మంత్రి హరీష్‌ ‌రావు

  • మేలో లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల రూ. 4100 కోట్లు ఆదాయాన్ని కోల్పోయాం
  • జిఎస్టీ కౌన్సిల్‌ ‌భేటీలో మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి
  • ఎఫ్‌ఆర్‌బీఎంను ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరిన మంత్రి

కోవిడ్‌ ఉధృతి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్నదని, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని 44వ జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశంలో మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. లాక్‌డౌన్‌ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదన్నారు. మే నెలలో లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల రూ. 4100కోట్లు ఆదాయాన్ని కోల్పోయమని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎంను నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎంపెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు. కోవిడ్‌ ‌టీకాను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు కోరారు.

అవసరాలకు అనుగుణంగా విదేశాల నుంచి టీకాల దిగుమతికి చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్‌ 19 ‌చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ ‌మినిస్టర్స్ ‌చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు. అవసరాలకు తగినంతగా దేశీయంగా కోవిడ్‌ ‌టీకా ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్‌ ఉధృతి వొస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు.

కోవిడ్‌ 19 ‌చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్‌, ఆక్సీమిటర్లు, హ్యాండ్‌ ‌శానిటైజర్లు, వెంటిలేటర్‌ ‌సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్‌ ‌సంగ్మా నేతృత్వంలోని గ్రూప్‌ ఆఫ్‌ ‌మినిస్టర్స్ ‌సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీలోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు కృతజ్ఞతలు తెలిపారు..

Leave a Reply