Take a fresh look at your lifestyle.

అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే రాష్ట్రం ముందంజ

  • రూ.7300 కోట్లతో హైదరాబాద్‌ ‌రూపురేఖలు మార్చాం
  • ఏప్రిల్‌ ‌నెల నుంచి కొత్త పింఛన్లు
  • ఉప్పల్‌ ‌పరిసర• ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

‌ప్రజాతంత్ర, ఉప్పల్‌, ‌మార్చి 11 : రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే ముందంజలో ఉందని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు వొచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఉప్పల్‌ ‌నియోజకవర్గంలోని మల్లాపూర్‌, ‌నాచారం, రామంతపూర్‌, ఉప్పల్‌లో పలు అభివృద్ధి పనులను మంత్రి చామకూర మల్లారెడ్డి,  మేయర్‌ ‌విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ ‌మోతే శ్రీలత శోభన్‌ ‌రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాశ్‌ ‌రెడ్డి, మాజీ మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌కార్పొరేటర్లతో కలిసి మంత్రి కేటీఆర్‌ ‌లాంఛనంగా ప్రారంభించారు.

 నూతనంగా నిర్మించిన మల్లాపూర్‌లో రూ.4 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం, నాచారం హెచ్‌ఎం‌టి పెద్ద చెరువు వద్ద రూ.411 కోట్లతో ఎస్‌టిపీ  పనులు, ఉప్పల్‌లో రూ.450 కోట్లతో ఫ్లైఓవర్‌ ‌థీమ్‌ ‌పార్క్, ‌రామంతపూర్‌లో రూ.2.2 కోట్ల వ్యయంతో ఎస్‌ఎన్‌డిపీ పనులను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌ ‌రెడ్డి అధ్యక్షతన మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..ఉప్పల్‌లో రూ.10 కోట్ల32 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలో ముందంజలో ఉందని అన్నారు. మల్లాపూర్‌ ‌డివిజన్‌లో వైకుంఠధామం పార్కును తలపిస్తుంది, ఇలాంటి వైకుంఠదామాలు ఉప్పల్‌ ‌నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత 7300 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ ‌రూపురేఖలు మార్చామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు ధీటుగా 1000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. జూన్‌ ‌నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్‌ ‌మీడియం ప్రవేశ పెడుతున్నట్లు కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.
గతేడాది వర్షాలు బాగా కురిసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని..ప్రతి నీటి మురికి చుక్కను మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉప్పల్‌ ‌వద్ద ట్రాఫిక్‌ ‌బాగా పెరిగిపోతోందని దీంతో ఇక్కడ ఫ్లై ఓవర్లు, స్కైవేలు కడుతున్నామని తెలిపారు. ఉప్పల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 35 కోట్లతో స్కై వాక్‌ను వొచ్చే నెలలోనే ప్రారంభిస్తామన్నారు. ఉప్పల్‌లో శిల్పారామం ఏర్పాటు చేసి, పజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. ఈ ఏడేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనునట్లు తెలిపారు. అన్ని వర్గాలకు, కులం, మతం అనే పంచాయితీ లేకుండా నిధులు కేటాయిస్తున్నామన్నారు. వొచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్‌యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని కేటీఆర్‌ ‌హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌, ఎల్బీనగర్‌ ‌జోనల్‌ ‌కమిషనర్‌ ‌పంకజ, ఎస్‌ ఈ అశోక్‌ ‌రెడ్డి, కాప్రా సర్కిల్‌ ఈఈ ‌కోటేశ్వరరావు, మల్లాపూర్‌ ‌కార్పొరేటర్‌ ‌పన్నాల దేవేందర్‌ ‌రెడ్డి, నాచారం కార్పొరేటర్‌ ‌సాయిజన్‌ ‌శాంతి శేఖర్‌, ‌హెచ్‌బి కాలనీ కార్పొరేటర్‌ ‌జెర్రిపోతుల ప్రభుదాస్‌, ‌చిల్కానగర్‌ ‌కార్పొరేటర్‌ ‌బన్నల గీత ప్రవీణ్‌, ‌మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్‌ ‌రెడ్డి,  కొత్త రామారావు, దన్‌పాల్‌ ‌రెడ్డి పిర్జాదిగూడ మేయర్‌ ‌జక్కా వెంకట్‌ ‌రెడ్డి, కాప్రా, ఉప్పల్‌ ‌సర్కిల్‌ అధికారులు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply