Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడి
రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు రాష్ట్ర పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడించారు. 83 లక్షల మందికి మొదటి డోసు టీకా ఇచ్చామన్నారు. మొత్తం 2.2 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 100 కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నామని తెలిపారు. 24 మొబైల్‌ ‌వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్‌ఎం‌సీలో రోజుకు 1500 మందికి పైగా టీకాలు ఇస్తున్నామని చెప్పారు. బుధవారం నుంచి 30 ఏండ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో కోటి మార్క్‌కు వ్యాక్సినేషన్‌ ‌చేరుకుంటుందన్నారు. జులై నెలలో 21 లక్షల డోసులు రానున్నాయి. టీచర్లు ఐడీ కార్డు చూపించి టీకా తీసుకోవొచ్చని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్‌ ‌వెలుగు చూడలేదని శ్రీనివాస్‌ ‌రావు స్పష్టం చేశారు.

ఇదిలావుంటే వీలైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా జీహెచ్‌ఎం‌సీ అదనపు ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం 40 కొత్త వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, బుధవారం మొబైల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌సేవలు ప్రారంభించారు. మొదటి రోజు 23 ప్రాంతాల్లో మొబైల్‌ ‌కేంద్రాల ద్వారా టీకా వేశారు. చార్మినార్‌, అం‌బర్‌పేట, సికింద్రాబాద్‌ ‌జోన్ల పరిధిలో మొబైల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌సెంటర్లు పని చేశాయి. నిర్ణీత ఏరియాల్లో ఒక్కో చోట టీకా వేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఒక్కో మొబైల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌టీంలో డాక్టర్‌, ‌ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ‌యూపీహెచ్‌ఎం‌సీ ఏఎన్‌ఎం‌లు సభ్యులుగా ఉన్నారు. బార్కస్‌, ‌జంగమ్మెట్‌, అం‌బర్‌పేట, పానీపురా, గోల్కొండ, నాంపల్లి, అవి•ర్‌పేట, శ్రీరాంనగర్‌ ‌తదితర ప్రాంతాల్లో మొబైల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌జరిగింది. ఒక్కో మొబైల్‌ ‌సెంటర్‌ ‌ద్వారా నిత్యం 300 మందికి టీకా వేయనున్నారు.

Leave a Reply