Take a fresh look at your lifestyle.

పిఎంఏవై-జి నిధుల్లో రాష్ట్రం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు..!

  • 153 పిఎం భారతీయ జనౌషది కేంద్రాలు
  • అందుబాటులో అవసరానికన్నా ఎక్కువ ఎరువులు
  • వరద సాయం కింద 245.96 కోట్లు..రిలీఫ్‌ ‌మెజర్స్ ‌కింద మరో 1526. 76 కోట్లు
  • గడిచిన ఏడేళ్లలో ఉపాధి హామీ పథకం కింద 17,459 కోట్లు
  • ఉచితంగా కోటి 63 లక్షల టీకా డోస్‌లు..!
  • పార్లమెంట్ లో రాష్ట్ర ఎంపీల పలు ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు

గడిచిన ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ ‌యోజన అర్బన్‌ ‌స్కీం(పిఎంఏవై- జి) కింద కేంద్రం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ ‌జ్యోతి తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం రూ. 19,078.87 లక్షలు రిలీజ్‌ ‌చేసిందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర సర్కార్‌ ఇం‌దులో ఒక్క రూపాయి వాడుకోలేదని స్పష్టం చేశారు. అందరికి ఇల్లు అనే నినాదంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 2021 -22లో 44.09 లక్షల ఇళ్లను నిర్మించాలని కేంద్ర టార్గెట్‌గా పెట్టుకుందని, అయితే, కొరోనా కారణంగా కేవలం 12.20 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసినట్లు ఎంపిలు కోమటి రెడ్డి, కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ స్కీమ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతంలో నిధులు ఇవ్వాల్సి ఉంటుందని తన సమాధానంలో పేర్కొన్నారు.

153 పిఎం భారతీయ జనౌషది కేంద్రాలు
తెలంగాణలో 153 ప్రధాన మంత్రి భారతీయ జనౌషది కేంద్రాలు(పిఎంబిజేకే) పని చేస్తున్నాయని కేంద్ర రసాయనాల శాఖ మంత్రి మన్‌ ‌సుఖ్‌ ‌మాండవీయ తెలిపారు. నేషనల్‌ ‌లిస్ట్ ఆఫ్‌ ఎసెన్షియల్‌ ‌మెడిసిన్స్(ఎన్‌ఎల్‌ఇఎమ్‌) ‌లోని జనరిక్‌ ఔషధాలను పిఎమ్‌బిజెకెలలో అందిస్తున్నట్లు తెలిపారు. పిఎమ్‌బిజెపిలో 1,451 రకాల మందులు, 204 శస్త్రచికిత్స వినియోగ వస్తువులు ఉన్నాయన్నారు. వీటిలో యాంటీఇన్ఫెక్టివ్స్, ‌యాంటీ-అలెర్జీ, యాంటీ-డయాబెటిక్స్, ‌కార్డియోవాస్కులర్‌, ‌యాంటీ క్యాన్సర్‌, ‌గ్యాస్ట్రో-పేగు మందులు, న్యూట్రాస్యూటికల్స్ ‌మొదలైనవి ప్రధాన చికిత్సా అంశాలను కవర్‌ ‌చేస్తుందని చెవేళ్ల ఎంపి రంజిత్‌ ‌రెడ్డితో సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

అందుబాటులో అవసరానికన్నా ఎక్కువ ఎరువులు
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఎరువులను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. 2020-21 రబీ సీజన్‌లో రాష్ట్రానికి 17.30 ఎల్‌ఎం‌టీ ఎరువులు అవసరమైతే, వివిధ గ్రూప్‌ల ద్వారా 24.10 ఎల్‌ఎం‌టిల ఎరువులను అందుబాటులో పెట్టినట్లు కేంద్రం ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి మన్‌ ‌సుఖ్‌ ‌మాండవీయ పేర్కొన్నారు. మరోవైపు ఖరీఫ్‌ 2021 ‌ప్రారంభానికి ముందు 14 ఎల్‌ఎం‌టీల యూరియా కేటాయింపు చేయాలని ఎరువులు మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు వెల్లడించారు. అయితే, డీఏసి అండ్‌ ఎఫ్‌ ‌డబ్ల్యూ శాఖ నెల వారీగా, రాష్ట్రాల వారీగా ప్రొడెక్షన్‌ ఆధారంగా ఎరువుల సరఫరాను చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణకు కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. కేటాయింపులను డీఏసి అండ్‌ ఎఫ్‌ ‌డబ్ల్యూ శాఖ డ్యాష్‌ ‌బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుందని ఎంపి రంజిత్‌ ‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

వరద సాయం కింద 245. 96 కోట్లు.. రిలీఫ్‌ ‌మెజర్స్ ‌కింద మరో 1526. 76 కోట్లు
తెలంగాణలో ఖరీఫ్‌ ‌సీజన్లో 2020 వరదల నష్టంపై ఇంటర్‌ ‌మినిస్టీరియల్‌ ‌సెంట్రల్‌ ‌టీమ్‌(ఐఎం‌సిటి) రాష్ట్రంలో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీ(హెచ్‌ఎల్‌సి) మీటింగ్‌లో రాష్ట్రానికి రూ. 245.96 కోట్లు అప్రూవ్‌ ‌చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 188. 23 కోట్లు అగ్రికల్చర్‌ ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడికి ఇచ్చినట్లు తెలిపింది. 33 శాతం, అంతకన్నా ఎక్కువ పంట నష్టం జరిగిన 2.39 లక్షల హెక్టార్లకు రాయితీ కల్పించినట్లు సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ‌తెలిపారు.

ఏర్పాటు చేసిన విధానం ప్రకారం ఈ నిధుల్ని రాష్ట్రానికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ వరద బాధితులకు రిలీఫ్‌ ‌మెజర్స్‌లో భాగంగా ఎస్డిఆర్‌ఎఫ్‌, ఎస్డిఆర్‌ఎంఎఫ్‌ ‌కింద మరో 449 కోట్లు రిలీజ్‌ ‌చేసినట్లు తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ‌ఖాతాలో ఓపెనింగ్‌ ‌బ్యాలెన్స్‌లోని 977.76 కోట్లు రాష్ట్రానికి అందించినట్లు స్పష్టంచేశారు. ఎస్డిఆర్‌ఎఫ్‌, ఎస్డిఆర్‌ఎంఎఫ్‌ ఆర్థిక ఉపశమనం కింద నిధులు అందించినట్లు తెలిపారు. వరదల కారణంగా నష్ట పోయిన రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ ‌బీమా యోజన కింద పరిహారం లభిస్తుందని వెల్లడించారు. 2020 వరదల సమయంలో సంభవించిన పంట నష్టంపై ఎంపి ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇలా జవాబు ఇచ్చారు.

గడిచిన ఏడేళ్లలో ఉపాది హామి పథకం కింద 17,459 కోట్లు
గడిచిన ఏడేళ్లు(2014 నుంచి ఇప్పటి వరకు) మహాత్మా గాంధీ నేషనల్‌ ‌రూరల్‌ ఎం‌ప్లాయిమెంట్‌ ‌గ్యారెంటీ స్కీం కింద రాష్ట్రానికి 17,459.35 కోట్ల నిధులు రిలీజ్‌ ‌చేసినట్లు కేంద్రం తెలిపింది. 2014-15 గానూ 1,919.96 కోట్లు, 2015-16 గానూ 1, 824. 84 కోట్లు, 2016-17 గానూ 1,806.84 కోట్లు, 2017-18 గానూ 2,539.20 కోట్లు, 2018-19 గానూ 2,958.17 కోట్లు, 2019-20 గానూ 2,246.78 కోట్లు, 2020-21 గానూ(ఇప్పటి వరకు) 4,163.56 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాద్వీ నిరంజన్‌ ‌జ్యోతి స్పష్టం చేశారు.

ఉచితంగా కోటి 63 లక్షల టీకా డోస్‌లు..!
తెలంగాణ రాష్ట్రానికి 1,63,96,460 టీకా డోసులను ఉచితంగా అందించినట్లు కేంద్రం రాజ్యసభలో తెలిపింది. జూలై 25 వరకు ఈ డోస్‌లను రాష్ట్రానికి సరఫరా చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ ‌పవార్‌ ‌స్పష్టం చేశారు. ఇందులో 1,17,80,450ల కోవిషీల్డ్, 46,16,010 ‌కోవ్యాక్సిన్‌ ‌డోసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 44.91 కోట్ల టీకాలను వివిధ రాష్ట్రాలకు ఉచితంగా అందించినట్లు వివరించారు. టీకాల సేకరణ, నిర్వహణతో కలిపి వ్యాక్సినేషన్‌ ‌పోగ్రామ్‌కు ఇప్పటివరకు 9,725.15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎంపి కే ఆర్‌ ‌సురేశ్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

కోవిడ్‌ ‌కారణంగా జన గణన వాయిదా..!..లోక్‌ ‌సభలో రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
కోవిడ్‌ 19 ‌వ్యాప్తి కారణంగా 2021 జన గణన వాయిదా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. సెన్సెస్‌ ‌యాక్ట్ 1948 ‌ప్రకారం రెండు దశల్లో 2021 జనాభా లెక్కలు సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ‌తెలిపారు. 2020లో ఏప్రిల్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య హౌజ్‌ ‌లిస్టింగ్‌, ‌హౌజింగ్‌ ‌సెన్సెస్‌పై, 2021లో ఫిబ్రవరి 9- 28 వరకు జన గణన చేపట్టాలని గతంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్య, ఎస్సీ/ఎస్టీ, మతం, భాష, వివాహం, అంగ వైకల్యం, వృత్తి, వలస వెళ్లిన వారి డేటా వంటి అంశాలపై జనాభా లెక్కల డేటా సేకరించనున్నట్లు ఎంపి రేవంత్‌ ‌ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

Leave a Reply