Take a fresh look at your lifestyle.

8‌న బడ్జెట్‌ ‌ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈ నెల 8న శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ‌ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఒక లక్షా 50వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంటనే విద్యుత్తు చార్జీలు, ఇంటిపన్ను, వాహనపన్ను, వంటి ఇతర పన్నులపైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఆదాయవనరులు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు చార్జీలు పెంచేందుకు అనుమతిని ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే ఇతర సుంకాలు పెంచేందుకు కూడా అనుమతిని ఇవ్వనున్నట్లు తెలిసింది.2018 పోలిస్తే జీఎస్‌టీ ఆదాయం 10 శాతం పెరిగిందని ఆర్థికశాఖ అధికారులు ఇచ్చిన నివేదికలు ధృవీకరిస్తున్నాయి. నీతిఅయోగ్‌ ‌సిఫారసు చేసినట్లు మిషన్‌భగీరథకు రూ.24వేల కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లుగా రూ.723కోట్లు గ్రాంటు వస్తుందా? లేదా? తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పౌష్టికాహార నిధుల కోసం ఇచ్చే రూ.171 కోట్లు నిధులు వస్తాయా? రావా? అనేది సందేహంగా ఉన్నదని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ఇచ్చే రూ.400 కోట్లు నిధులు ఎప్పుడు ఇస్తారని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు.ఈ ఆదాయవనరులన్నింటినీ సమీక్షించుకొని బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు.పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో గతేడాది సమర్పించి న ఓట్‌ఆన్‌అకౌంట్‌లో సవరణలు చేసి గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్థిస్తాయి బడ్జెట్‌లో 1లక్షా 46వేల ఆంచనాలతో బడ్జెట్‌ ‌లతప్రవేశపెట్టారుపెట్టారు.

స్థానిక సంస్థల కోసం కేంద్రం నుంచి రూ.1847 కోట్లు అందనున్నాయి. ఈ నిధులను 70శాతం గ్రామపంచాయతీలకు, 20శాతం మండలప్రజాపరిషత్తుకు,10శాతం జిల్లాపరిషత్తులకు కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్తులకు వివిధ మార్గాల ద్వారా ఆదాయవనరులు సమకూరుతాయనే అంచనాలతో ఈ నిష్పత్తిలో కేటాయింపులు జరిపారు.గ్రామాల అభివృద్ధికోసం 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.ఈ వరుసలోనే కేంద్రం నుంచి వచ్చే నిధులు, జీహెచ్‌ఎం‌సీ నుంచి వచ్చే ఆదాయం, వివిధ స్థానిక సంస్థల ఆదాయవనరులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుదిమెరుగులు దిద్దుతున్నారు.కేంద్రం నుంచి వచ్చే నిధులనుమ పరిగణనలోకి తీసుకొని అంచనాలను రూపొందిస్తున్నారు.

Leave a Reply