- మెదక్ జిల్లాలో 581 బృందాలతో లక్షా 40 వేల ఇళ్ల సర్వే
- 6 వేల మందికి కొరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తింపు
- ధాన్యం సేకరణలో ప్రైవేట్ ట్రాక్టర్ల వినియోగం
- కలెక్టరేట్లో వివిద అంశాలపై సమీక్షించిన మంత్రి హరీష్ రావు
కొరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లాలో 581 బృందాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయడం జరిగిందన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో కొవిడ్, ధాన్యం కొనుగోలు, పురపాలికలో వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, సవి•కృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, కలెక్టర్ హరీశ్‌తో కలిసి సవి•క్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూదానిలో భాగంగా 6126 మందిని గుర్తించామని అనగా 4.5 శాతం మాత్రమేనని అందులో 3,491 మందికి కోవిడ్ మందుల కిట్లు, పిస్క్రిప్షన్ అందించడంతో పాటు స్వల్ప లక్షణాలున్న మరికొందరికి మందులు అందించారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్ లలో ఆక్సిజన్‌తో కూడిన 260 పడకలు అందుబాటులో ఉన్నాయని, కాగా అందులో ప్రస్తుతం 42 మంది కొవిడ్ రోగులు ఉన్నారన్నారు. ఇంకా 218 పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిలాలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ లలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, ఇతర మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 తరువాత 45 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోసు టీకా వేస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, అత్యవసర పరిస్థిని గుర్తించి ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని కాబట్టి గ్రామాలలో అందరు స్వీయ నియంత్రణ పాటించేలా ప్రజా ప్రతినిధులు చూడాలని, మాస్కు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించాల్సిందిగా సూచించారు.
అలాగే వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసే పక్రియ వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.ఇప్పటికీ జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. జిల్లాలో లక్షా 40 వేల కుటుంబలను ఇంటింటి సర్వే చేయగా 6 వేల మందికి కొరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రజలు సహకరిస్తేనే కొరోనా కట్టడి సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లాలో 240 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో 600 బెడ్స్‌కు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేర జిల్లాలో నిల్వలున్నాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు.