Take a fresh look at your lifestyle.

కోడికూర కోసం కన్నతండ్రిని హతమార్చిన కొడుకు

Crime

కోడికూర కోసం కన్న తండ్రిని హతమార్చిన వైనం కరీంనగర్‌ ‌జిల్లా శంకరపట్న మండలం కొత్తగట్టులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్లగా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్‌ ‌మదార్‌ ‌బండరాయి కొడుతూ కొత్తగట్టులో గత రెండు నెలలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్‌ ‌కోడికూర వండిపెట్టాలని కొడుకీ ఖాసీంతో గొడవకు దిగాడు. దీనితో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది.నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్న తండ్రి వేధింపులకు విసుగొచ్చిన ఖాసీం నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో బాధి హతమార్చినాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాసీమ్‌ ‌ను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply