Take a fresh look at your lifestyle.

రైతు సమస్యలకు పరిష్కారం మద్దతు ధరలతోనే..

The solution to the problems of the farmer is with support prices ..

  • రుణమాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే
  • అగ్రోటెక్‌ -2020 ఎగ్జిబిషన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే వ్యవసాయ రంగ సమస్యలన్నింటికీ పరిష్కారమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.రుణమాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని మొత్తం సమస్యలను పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. బ్యాంకుల ద్వారా 50శాతం రైతులు మాత్రమే రుణాలు పొందుతున్నారని, మిగతా 50 శాతం రైతులు ప్రైవేట్‌ ‌వ్యాపారస్తుల దగ్గర రుణాలు తెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం జయశంకర్‌ ‌తెలంగాణ వ్యవసాయ విద్యాలయంలో జరిగిన అగ్రెటెక్‌-2020 ఎగ్జిబిషన్‌కు ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయనతోపాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ,  రాష్ట్రవ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలను చేపట్టాయని, అయినప్పటికీ మెజార్టీ రైతులకు ఈ పథకాలు చేరడం లేదని ఆయన పేర్కొన్నారు.ఈ కారణంతోనే రైతులు నిరాశా నిస్సృహలకు లోనవుతున్నారని అన్నారు సంప్రదాయ పంటల నుంచి రైతుల దృష్టి మరల్చాలని తద్వారా మాత్రమే అనేక రుగ్మతలకు మార్గం లభిస్తుందని అన్నారు.పంటలు పండించడంతో పాటు ఇతర ఉద్యానపంటలు, పట్టుపరిశ్రమ,కోళ్ల ఫామ్‌, ‌రొయ్యలపెంపకం చేసే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుతున్నారని,ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలని చెప్పారు.

సంప్రాదాయ పంటలను పండించడంతోపాటు అనుబంధ వ్యవసాయ రంగంపై కూడా శ్రమించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని సంరంక్షించుకుంటూ, అంతర్‌పంటలు పండిస్తూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని అన్నారు.  అగ్రోటెక్‌ ఎగ్జిబిషన్‌లు గ్రామ ప్రాంతాల్లో నిర్వహించాలని  తద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. క్రిమిసంహారక మందులు పూర్తిగా తగ్గించాలని ఆర్గానిక్‌ ఎరువుల వాడకం పెంచాలని, ఖర్చులు తగ్గించుకోవాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.ఫుడ్‌‌ప్రాసెసింగ్‌, ‌వాల్యూ ఎడిషన్‌లపై దృష్టిసారించాలని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించిందని చెప్పారు. కాళేశ్వరం వంటి బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ ‌ద్వారా  తెలంగాణలో 50లక్షల ఎకరాలు సాగయ్యేందుకు అవకాశం వచ్చిందని అన్నారు.నకిలీ విత్తనాలు,నకిలీపురుగుమందుల బెడదలేకుండా, రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయగులుగుతున్నామని, ఎరువుల కొరతనేది లేకుండా చేశామని చెప్పారు ఖరీఫ్‌సీజన్‌లో 57లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ప్రకారం ఎకరాకు రూ.5వేలచొప్పున •పెట్టుబడిని అందించామని పేర్కొన్నారు..రైతుల సామాజిక ఆర్థిక భద్రత కోసం రైతుబీమా ప్రవేశపెట్టామని, ఈ చర్యలన్నింటినీ తీసుకోవడంతో తెలంగాణలో వ్యవసాయం పండుగయ్యిందని మంత్రి చెప్పారు.రైతుల పక్షపాతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించడం శుభపరిణామమని  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.వి.ప్రవీణ్‌రావు పేర్కొన్నారు..  సీఐఐ తెలంగాణచైర్మన్‌ ‌డి.రాజు, అగ్రిటెక్‌ -‌సౌత్‌ ‌చైర్మన్‌ అనిల్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply